వారణాసి, అక్టోబర్ 27: వారణాసి వీధుల్లో తిరిగే ఓ వీధి కుక్కకు మహాయోగం పట్టింది. డచ్ జాతీయురాలైన మెరల్ బొటెన్బల్ ఇటీవల వారణాసి వచ్చినప్పుడు జయ అనే శునకంతో అనుబంధం ఏర్పడింది. సహజంగా జంతు ప్రేమికురాలైన మెరల్.. జయను తనతో పాటు నెదర్లాండ్స్‌కు తీసుకెళ్లడానికి నిశ్చయించుకుంది. జయకు అవసరమైన వీసా, పాస్‌పోర్ట్‌ను పొందడానికి ఆమె భారత్‌లోనే ఆరు నెలల పాటు ఉండిపోయి ఎట్టకేలకు వాటిని పొందింది. త్వరలోనే జయతో నెదర్లాండ్ వెళ్లనున్నది.