శుక్రవారం 22 జనవరి 2021
International - Dec 16, 2020 , 18:06:59

చైనాకు డ‌బ్ల్యూహెచ్‌వో.. కొవిడ్‌పై ద‌ర్యాప్తు

చైనాకు డ‌బ్ల్యూహెచ్‌వో.. కొవిడ్‌పై ద‌ర్యాప్తు

బీజింగ్‌: ప‌్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు చెందిన అంత‌ర్జాతీయ బృందం వ‌చ్చే నెల‌లో చైనాలో ప‌ర్య‌టించ‌నుంది. క‌రోనా వైర‌స్‌పై ద‌ర్యాప్తు జ‌ర‌ప‌డానికి ఈ బృందం వెళ్తున్న‌ట్లు డ‌బ్ల్యూహెచ్‌వో బుధ‌వారం వెల్ల‌డించింది. క‌రోనా వైర‌స్ మూలాలు ఎక్క‌డ ఉన్నాయో తేలాల్సిందేన‌ని అంత‌ర్జాతీయ స‌మాజం చాలా రోజులుగా డిమాండ్ చేస్తోంది. ఈ నేప‌థ్యంలో వైర‌స్ మొద‌ట క‌నిపించిన వుహాన్‌పైనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అక్క‌డి నుంచి చైనాలోని మిగిలిన ప్రాంతాల‌కు, ఆ త‌ర్వాత ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల‌కు ఈ వైర‌స్ వ్యాపించింది. అయితే ఈ వైర‌స్ త‌మ ద‌గ్గ‌ర పుట్టింది కాద‌ని చైనా వాదిస్తోంది. త‌మ‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆరోపించింది. ఇత‌ర దేశాల నుంచి చైనాకు వ‌చ్చిన ఆహార ప‌దార్థాల ద్వారానే త‌మ దేశానికి వైర‌స్ వ‌చ్చిన‌ట్లు కూడా ప్ర‌చారం మొద‌లుపెట్టింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ త‌న ద‌ర్యాప్తులో ఏం తేలుస్తుందో అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. 


logo