కొవిడ్‌తో ప్రతి 44 సెకన్లకు ఒకరు మృతి : ప్రపంచ ఆరోగ్య సంస్థ
న్యూఢిల్లీ : ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో సాధారణ స్థితికి చేరుకున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 44 సెకన్లకు ఓ వ్యక్తి కొవిడ్‌తో మరణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేసన్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసులు, మరణాల్లో కీణత కొనసాగుతోందని.. కానీ, ఈ ధోరణి కొనసాగుందనే గ్యారంటీ లేదన్నారు. ఫిబ్రవరి నుంచి మరణాల సంఖ్య 80శాతానికిపైగా తగ్గిందని, గత వారంలో 44 సెకన్లకు ఒకరు కొవిడ్‌తో మరణించారని బ్రీఫింగ్లో తెలిపారు. ఆ మరణాల్లో చాలా వరకు నివారించదగినవన్నారు.
మహమ్మారి ఇంకా ముగియలేదని నేను చెప్పడం విని మీరు విసిగిపోయి ఉండవచ్చని, ఈ వైరస్ అంతరించిపోదని ఇప్పటి వరకు చెప్పానని.. ఇంకా చెబుతూనే ఉంటానన్నారు. ఇదిలా ఉండగా.. గత 24గంటల్లో దేశంలో కొత్తగా 5,076 కొవిడ్ కేసులు నమోదవగా.. ప్రస్తుతం 47వేలకుపైగా యాక్టివ్ కేసులున్నాయి. మంకీపాక్స్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ స్పందిస్తూ ఐరోపాలో మంకీపాక్స్ తిరోగమనంలో ఉందన్న ఆయన.. గత వారం అమెరికాలో కేసుల పెరుగుదల క్షీణించినా.. ఆ ప్రాంతంలో ఇన్ఫెక్షన్పై తీర్మానాలు చేయడం కష్టమన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 52,997 మంది మంకీపాక్స్ బారినపడ్డారు. గతనాలుగు వారాల్లో నమోదైన కేసుల్లో 70.7శాతం అమెరికా నుంచి, 28.3శాతం యూరప్ నుంచే ఉన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

