శాన్ఫ్రాన్సిస్కో, మే 21: వాట్సాప్ యాప్‌లోనే నచ్చిన ఫొటోను స్టిక్కర్‌గా మార్చుకునే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు దాని మాతృ సంస్థ మెటా ప్రయత్నిస్తున్నది. తర్వాతి అప్డేట్లో ఐఓఎస్‌లో ఈ ఫీచర్ తీసుకురానున్నది. ‘న్యూ స్టిక్కర్’ పేరుతో తెస్తున్న ఈ కొత్త ఆప్షన్ ద్వారా యూజర్లు ఫోన్ లైబ్రరీలోని ఏదైనా ఫొటోను ఎంచుకొని దానిని స్టిక్కర్‌గా మార్చవచ్చు. ఇప్పటివరకు థర్డ్ పార్టీ అప్లికేషన్ల ద్వారా ఇలా స్టిక్కర్లు చేసుకోవాల్సి వచ్చేది. ఇలాంటి టూల్ ఇప్పటికే వాట్సాప్ వెబ్, డెస్క్‌టాప్ యూజర్లకు అందుబాటులో ఉంది. దీంతో పాటు మాక్ ఓఎస్ డివైజ్‌లలోనూ గ్రూప్ కాలింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నది.