Donald Trump | ట్రంప్ ఆగమాగం!..ఇరాన్ యుద్ధంపై అంతుచిక్కని అమెరికా అధ్యక్షుడి వ్యవహారం
యుద్ధం మొదలై ఐదు వారాలైనప్పటికీ ఇరాన్ వెనక్కి తగ్గకపోవడం.. యుద్ధం ఖర్చులు తడిసి మోపెడు కావడం.. గల్ఫ్‌లోని యుద్ధ స్థావరాలు ధ్వంసం సహా భారీగా నష్టం వాటిల్లడం.. హొర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచ దేశాల్లో ఇంధన సంక్షోభం తలెత్తి అమెరికాపై ఒత్తిడి పెరగడం.. హొర్ముజ్‌ను తెరిపించడానికి సాయం కోసం తాను చేసిన విజ్ఞప్తికి నాటో కూటమి సహా ఏ మిత్ర దేశమూ స్పందించకపోవడం.
- రోజుకో మాట.. పూటకో ప్రకటన
- ఇరాన్ యుద్ధంపై అంతుచిక్కని అమెరికా అధ్యక్షుడి వ్యవహారం
- యుద్ధం ఇంకో రెండు మూడు వారాల్లో ముగిస్తామని నిన్న ప్రకటన
- హొర్ముజ్ తెరిచే వరకూ ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తామని నేడు మరోసారి హెచ్చరిక
వాషింగ్టన్: యుద్ధం మొదలై ఐదు వారాలైనప్పటికీ ఇరాన్ వెనక్కి తగ్గకపోవడం.. యుద్ధం ఖర్చులు తడిసి మోపెడు కావడం.. గల్ఫ్‌లోని యుద్ధ స్థావరాలు ధ్వంసం సహా భారీగా నష్టం వాటిల్లడం.. హొర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచ దేశాల్లో ఇంధన సంక్షోభం తలెత్తి అమెరికాపై ఒత్తిడి పెరగడం.. హొర్ముజ్‌ను తెరిపించడానికి సాయం కోసం తాను చేసిన విజ్ఞప్తికి నాటో కూటమి సహా ఏ మిత్ర దేశమూ స్పందించకపోవడం.. ఇరాన్ దాడుల నుంచి రక్షించాలని గల్ఫ్ దేశాలు మొరపెట్టుకోవడం.. అమెరికన్ పౌరులు సైతం తనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించడం వంటి పరిణామాలతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇరాన్ యుద్ధంపై ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక సతమతమవుతున్నారు.
యుద్ధం విషయంలో రోజుకో తీరుగా ఆయన చేస్తున్న ప్రకటనలు ఆయన ఫ్రస్ట్రేషన్‌ను స్పష్టంచేస్తున్నాయి. ఒప్పందానికి ఇరానే తహతహలాడుతున్నదని ఒకసారి.. ఒప్పందానికి రాకుంటే ఇరాన్‌పై విరుచుకుపడతామని మరోసారి, ఇరాన్‌తో అసలు ఒప్పందమే అవసరం లేదని ఇంకోసారి ఆయన ప్రకటించడం చూస్తే యుద్ధంపై ఆయన వైఖరి అర్థమవుతుంది. హొర్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకుంటామని, ఖర్గ్ దీవిని బాంబులతో పేల్చేస్తామని ఒకపక్క హెచ్చరికలు జారీచేస్తూ మరోపక్క కాల్పుల విరమణ కోసం ఇరాన్ నాయకత్వం తనతో సంప్రదింపులు జరుపుతున్నదని ప్రకటిస్తున్నారు. ఇరాన్ ఒప్పందం చేసుకున్నా చేసుకోకపోయినా మరో 2, 3 వారాల్లో తాము యుద్ధం నుంచి తప్పుకుంటామని మంగళవారం ప్రకటించిన ట్రంప్ బుధవారం ఇందుకు పూర్తి భిన్నంగా కాల్పుల విరమణ కోసం ఇరాన్ నాయకత్వం తనను సంప్రదించిందని చెబుతూ హొర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేవరకు ఇరాన్‌తో కాల్పుల విరమణపై చర్చలు జరిపే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఇరాన్‌ను రాతియుగానికి పంపేంతవరకు ఆ దేశంపై దాడులు కొనసాగుతూనే ఉంటాయని కూడా ఆయన హెచ్చరించారు.
ఒప్పందం కోసం సంప్రదించిన ఇరాన్..
కాల్పుల విరమణ కోరుతూ ఇరాన్ కొత్త నాయకత్వం తనను సంప్రదించిందని డొనాల్డ్ ట్రంప్ బుధవారం వెల్లడించారు. అయితే వ్యూహాత్మక హొర్ముజ్ జలసంధిని ప్రపంచ నౌకల కోసం తిరిగి తెరిచేంత వరకు అమెరికా ఆ విషయాన్ని పరిశీలించబోదని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ప్రకటించారు. అయితే తనను సంప్రదించిన నాయకుడి పేరును ప్రస్తావించని ట్రంప్ ఆ వ్యక్తిని తీవ్రవాద భావజాలం తక్కువ ఉన్న వ్యక్తిగా, తన పూర్వీకుల కంటే చాలా తెలివైన వ్యక్తిగా అభివర్ణించారు. అయితే యుద్ధానికి విరమణ ఇవ్వడం అనేది సముద్ర భద్రతకు సంబంధించిన షరతులతో కూడుకుని ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. తీవ్రమవుతున్న సంక్షోభానికి కేంద్రంగా ఉన్న కీలకమైన చమురు రవాణా మార్గమైన హొర్ముజ్ జలసంధి తెరుచుకుని, స్వేచ్ఛగా, స్పష్టంగా ఉన్నపుడు యుద్ధ విరామం గురించి పరిశీలిస్తామని ఆయన తెలిపారు. ఇరాన్‌పై యుద్ధం ఐదవ వారంలోకి ప్రవేశించిన నేపథ్యంలో సైనిక చర్యలు కొనసాగుతాయని ట్రంప్ పునరుద్ఘాటించారు. మళ్లీ రాతియుగానికి పంపేంతవరకు ఇరాన్‌పై దాడులు కొనసాగుతూనే ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఇరాన్ నుంచి వేగంగా నిష్క్రమిస్తామని పేర్కొన్నారు.
2, 3 వారాల్లో ముగించేస్తా
అమెరికా అధ్యక్షుడి తాజా వ్యాఖ్యలు ఒక రోజు ముందు ఆయన చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ యుద్ధరంగంతో దౌత్యం సమాన స్థాయికి వచ్చేవరకు తాను వేచి ఉండకపోవచ్చునని చెప్పారు. రెండు, మూడు వారాల్లో ఇరాన్లో సైనిక చర్యను ముగించేస్తానని ఆయన ప్రకటించారు. సైనిక దాడి ముగింపు కోసం ఇరాన్ ఒప్పందం కుదుర్చుకోవలసిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. యుద్ధం ఎలా ముగుస్తుందన్న విలేకరుల ప్రశ్నకు ఆయన జవాబిస్తూ అతి త్వరలోనే నిష్క్రమిస్తున్నామని చెప్పారు. రెండు లేదా మూడు వారాల్లో నిష్క్రమణ జరగవచ్చని ఆయన అన్నారు. ఇరాన్ అమెరికాతో కాని, తనతో కాని ఒప్పందం చేసుకోవలసిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అంతకుముందు అమెరికా రక్షణ మంత్రి పీటె హెగ్సెత్ విలేకరులతో మాట్లాడుతూ యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్‌తో ఒప్పందం చేసుకోవడానికి ట్రంప్ సుముఖంగా ఉన్నారని చెప్పారు. ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని, ఇరాన్ ఒప్పుకోకపోతే దాడులు కొనసాగించడానికి అమెరికా సిద్ధమని ఆయన చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

