అంత తక్కువ ధరకు మా వ్యాక్సిన్ అమ్మలేం: ఆర్డీఐఎఫ్

న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా వైరస్‌కు మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తోంది. డీసీజీఐ రష్యాకు చెందిన స్పుత్నిక్ వికి అనుమతి ఇచ్చింది. అయితే దీని ధర ఎంత ఉంటుందన్నదానిపై ఇంత వరకూ స్పష్టత రాలేదు. ధరల విషయంలో ప్రభుత్వంతో రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) ఇంకా చర్చలు జరుపుతోంది.
అయితే ప్రస్తుతం కొవిషీల్డ్ పేరుతో ఇండియాలో తయారవుతున్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అంత తక్కువ ధర మాత్రం తమకు సాధ్యం కాదని ఆర్డీఐఎఫ్ సీఈవో కిరిల్ దిమిత్రీవ్ స్పష్టం చేశారు. ఆస్ట్రాజెనెకా ధర చాలా తక్కువ. ఆ ధరకు మా వ్యాక్సిన్ ఇస్తామని నేను కచ్చితంగా చెప్పలేను. ఇతర మార్కెట్లలో స్పుత్నిక్ ధర ఆస్ట్రాజెనెకా కంటే ఎక్కువగా ఉంది అని ఆయన అన్నారు.
ప్రస్తుతం ఇండియాలో కొవిషీల్డ్‌ను ప్రైవేట్‌లో అయితే అన్ని పన్నులూ కలిపి రూ.250కే ఇస్తున్న విషయం తెలిసిందే. అదే స్పుత్నిక్ టీకా మాత్రం ఇతర దేశాల్లో 10 డాలర్లు (సుమారు రూ.750)గా ఉంది. దాదాపు అన్ని దేశాల్లో తాము ఒకే ధరకు వ్యాక్సిన్ అందిస్తున్నట్లు కిరిల్ చెప్పారు. ప్రస్తుతం ఇండియాలో ధరలపై నియంత్రణ ఉందన్న విషయం తమకు తెలుసని ఆయన అన్నారు.
తమకు కూడా ఏదో భారీగా సంపాదించుకోవాలన్న ఆశ లేదని, అయితే కనీసం తమ పెట్టుబడి అయినా రావాలనుకుంటున్నట్లు కిరిల్ చెప్పారు. ఇండియాలో జూన్ నాటికి పెద్ద ఎత్తున తమ వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండియాలో ఏటా 85 కోట్ల వ్యాక్సిన్ల ఉత్పత్తినే ఆర్డీఐఎఫ్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఇవి కూడా చదవండి
అరుదైన బ్లడ్ క్లాట్.. జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ నిలిపేసిన అమెరికా
కొత్త రోగాలు వస్తాయి.. వన్యప్రాణుల అమ్మకాలను ఆపండి: డబ్ల్యూహెచ్‌వో
స్పుత్నిక్ వ్యాక్సిన్ ధర ఎంత? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
పని ఎక్కువ అవుతున్నదంటూ ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా
IPL 2021: అతన్ని 16 కోట్లు పెట్టి కొన్నది ఇందుకేనా?
ప్రపంచంలో ఆ 8 మంది దగ్గరే 75 లక్షల కోట్ల సంపద
IPL 2021: రాజస్థాన్ రాయల్స్ బౌలర్ వింత యాక్షన్ చూశారా.. వీడియో
‘స్పుత్నిక్ వి’కి డీసీజీఐ గ్రీన్‌సిగ్నల్
పది లక్షల టన్నుల న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వృథా నీళ్లు సముద్రంలోకి!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

