న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి స్పుత్నిక్ వి రూపంలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. మంగళవారమే డీసీజీఐ ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. అయితే ఈ వ్యాక్సిన్ ధర ఇండియాలో ఎంత ఉండబోతోంది? ఈ వ్యాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? దీని సామర్థ్యం ఎంత? టీకా ఎలా వేస్తారు? స్టోరేజ్ ఎలా అన్న అంశాలను ఇప్పుడు సమగ్రంగా చూద్దాం.
వ్యాక్సిన్ సామర్థ్యం ఎంత?
లాన్సెట్‌లో ప్రచురించిన డేటా ప్రకారం 60 ఏళ్లు పైబడిన వాళ్లలో స్పుత్నిక్ వి సామర్థ్యం 91.8 శాతం. మధ్యస్థ స్థాయి నుంచి తీవ్ర స్థాయి కొవిడ్-19 విషయంలో 100 శాతం సమర్థంగా పని చేస్తున్నట్లు తేలింది. ఇండియాలో మొత్తం 13 వేల మంది క్లినికల్ ప్రయోగాల్లో పాల్గొన్నారు. ఈ అధ్యయనం ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఇది జూన్‌లోగా పూర్తి కానుంది. ఆ తర్వాతే ఇండియాలో దీని సామర్థ్యంపై సమగ్ర వివరాలు అందుతాయి.
స్పుత్నిక్ వి స్టోరేజ్ ఎలా?
ఈ వ్యాక్సిన్‌ను రెండు విధాలుగా స్టోర్ చేయవచ్చు. ద్రవ రూపంలో అయితే -18 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అవసరం. పొడి రూపంలో అయితే 2-8 డిగ్రీల సెంటిగ్రేడ్ సరిపోతుంది. అంటే మన ఇండ్లలో ఉండే రిఫ్రెజిరేటర్లలోనూ దీనిని స్టోర్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా కోల్డ్-చెయిన్ అవసరం లేదు.
స్పుత్నిక్ వి ధర ఎంత?
ప్రస్తుతం ఇండియాలో ఇస్తున్న రెండు వ్యాక్సిన్ల ధర కూడా డోసుకు రూ.250 మాత్రమే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయితే ఫ్రీగా ఇస్తున్నారు. స్పుత్నిక్ వి ధర ఇండియాలో ఎంత అన్నది మాత్రం ఇంకా తెలియలేదు. ఇతర దేశాల్లో మాత్రం పది డాలర్లు (రూ.750)లోపే ఉంది.
స్పుత్నిక్ వి ఎలా ఇస్తారు?
మిగతా రెండు వ్యాక్సిన్లలాగే స్పుత్నిక్ వి కూడా రెండు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో డోసు 0.5 మిల్లీలీటర్లు. అయితే తొలి, మలి విడత డోసులకు కాస్త వేరుగా ఉండే వెర్షన్లను ఉపయోగించడం స్పుత్నిక్ వి ప్రత్యేకత. తొలి డోసు (rAd26) ఓ వెక్టార్ కాగా.. రెండో డోసు (rAd5) మరో వెక్టార్. రెండు వేర్వేరు వెక్టార్లను వాడినా ఇవి రెండూ వైరస్ స్పైక్ ప్రొటీన్‌పై దాడి చేస్తాయి. ఒకే వెర్షన్ కంటే రెండు వెర్షన్లు వాడితే శరీరంలో రోగనిరోధక శక్తి మరింత పెరుగుతుందని ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన వాళ్లు చెబుతున్న మాట. ఒకటి, రెండు డోసులను 21 రోజుల వ్యవధిలో ఇస్తారు.
స్పుత్నిక్ వి.. సైడ్ ఎఫెక్ట్స్ తక్కువే
ఇప్పటి వరకూ స్పుత్నిక్ వితో తీవ్ర పరిణామాలు ఎదురైన సందర్భాలు ఏమీ లేవు. జలుపు, తలనొప్పిలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే కనిపించినట్లు డేటా చెబుతోంది. వ్యాక్సిన్ తీసుకున్న చెయ్యి నొప్పిగా ఉండటం, అలసిపోయినట్లు ఉండటం, కాస్త ఉష్ణోగ్రత పెరగడంలాంటి స్వల్ప లక్షణాలే కనిపించినట్లు తేలింది. ఇప్పటి వరకూ ఈ వ్యాక్సిన్ తాలూకు మరణాలు ఏవీ సంభవించలేదు. ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌ను 59 దేశాలు వినియోగిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
IPL 2021: అతన్ని 16 కోట్లు పెట్టి కొన్నది ఇందుకేనా?
ప్రపంచంలో ఆ 8 మంది దగ్గరే 75 లక్షల కోట్ల సంపద
IPL 2021: రాజస్థాన్ రాయల్స్ బౌలర్ వింత యాక్షన్ చూశారా.. వీడియో
‘స్పుత్నిక్ వి’కి డీసీజీఐ గ్రీన్‌సిగ్నల్
పది లక్షల టన్నుల న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వృథా నీళ్లు సముద్రంలోకి!
ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ
లంగా ఓణీలో మెరిసిపోతున్న శ్రీముఖి
ఉగాది స్పెషల్.. ఇంట్రెస్టింగ్ పోస్టర్స్ విడుదల