మాలా వచ్చా చూడు.. చాలా తెచ్చా పాలు..!
అగ్ర కథానాయకుడు వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ఆదర్శకుటుంబం - AK 47’.. అనే ప్రకటన వచ్చిన నాటినుంచీ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మొదలయ్యాయి.
అగ్ర కథానాయకుడు వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ఆదర్శకుటుంబం – AK 47’.. అనే ప్రకటన వచ్చిన నాటినుంచీ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మొదలయ్యాయి. అత్యంత వినోదాత్మకంగా, కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలతో కూడిన కథాంశంతో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ(చినబాబు) నిర్మిస్తున్నారు. మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం ఈ సినిమా నుంచి రెండో పాటను మేకర్స్ విడుదల చేశారు.
‘మాలా వచ్చా చూడు.. చాలా తెచ్చా పాలు.. నలగాలీ పూలూ ఒళ్లు.. అరవాలీ మంచం కోళ్లు’ అంటూ సాగే ఈ రొమాంటిక్ మాస్ గీతాన్ని వెంకటేశ్, నివేదా పేతురాజ్లపై చిత్రీకరించారు. ఈ పాటలో వెంకీ, నివేదాల స్క్రీన్ ప్రెజన్స్, కెమిస్ట్రీ, ఉత్సహభరితమైన వారి అభినయం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ పాటను తమన్ స్వరపరచగా, ధనుంజయ్ సీపాన, రణినారెడ్డి ఆలపించారు. భాను మాస్టర్ నృత్య రీతుల్ని సమకూర్చారు. త్వరలోనే ట్రైలర్ విడుదల కానున్నది. శ్రీనిధిశెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రవి కె.చంద్రన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

