పని ఎక్కువ అవుతున్నదంటూ ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా

వియన్నా: కరోనా ఆరోగ్య సిబ్బందిపైనే కాదు నేతలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ మహమ్మారి వెలుగు చూసినప్పటి నుంచీ పని బాగా ఎక్కువైపోయి ఇక తన వల్ల కాదంటూ ఆస్ట్రియా ఆరోగ్య శాఖ మంత్రి రుడాల్ఫ్ ఆన్షోబెర్ తప్పుకున్నారు. పని భారం వల్ల తన ఆరోగ్యం తరచూ దెబ్బతింటున్నదని చెబుతూ మంగళవారం తన పదవికి ఆయన రాజీనామా చేశారు. గతేడాది జనవరిలో ఆయన ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే కరోనా మహమ్మారి విరుచుకుపడింది.
తొమ్మిదేళ్ల కింద కూడా ఇలాగే పని భారం ఎక్కువై కుప్పకూలిపోయిన తనకు గత నెల రోజుల వ్యవధిలోనే రెండుసార్లు హైబీపీ నమోదైందని, పూర్తి అలసటకు గురయ్యానని రుడాల్ఫ్ చెప్పారు. తాను చాలా ఎక్కువగా పని చేశానని, గత కొన్ని వారాలుగా ఇక ఈ బాధ్యతలు తన వల్ల కాదని అనిపించిందని తెలిపారు. ఈ కరోనా కాలంలో 100 శాతం ఫిట్‌గా ఉన్న ఆరోగ్య మంత్రి ఆస్ట్రియాకు కావాలని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

