Warren Buffett | న్యూఢిల్లీ: బెర్క్‌షైర్ హాథవే చైర్మన్ వారెన్ బఫెట్ (94) తన మరణానంతరం తన సంపదను విరాళంగా ఇవ్వడానికి మరోసారి ఏర్పాట్లు చేశారు. శుక్రవారం నాటికి ఆయనకు మిగిలిన సంపద విలువ 149.7 బిలియన్ డాలర్లు.
ఈ సంపదను తన కుమార్తె సుసీ (71), ఇద్దరు కుమారులు హోవర్డ్ (69), పీటర్ (66) పర్యవేక్షిస్తున్న చారిటబుల్ ట్రస్ట్‌కు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. నాలుగు ఫ్యామిలీ ఫౌండేషన్స్‌కు రూ.9,604 కోట్లు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆయన సోమవారం ప్రకటించారు.