మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై తిరుగుబాటు చేసిన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్ మృతిచెందడంతో ఆ గ్రూప్‌ను చేజిక్కించుకునేందుకు పుతిన్ పావులు కదుపుతున్నారు. వాగ్నర్ గ్రూపును పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకొనేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. భవిష్యత్తులో ఎటువంటి తిరుగుబాట్లు రాకుండా వాగ్నర్ కిరాయి సైనికులను రష్యా ప్రభుత్వానికి విధేయులుగా ఉంటామని ప్రమాణం చేస్తూ సంతకాలు చేయాలని పుతిన్ ఆదేశించినట్టు మీడియా కథనాలు వెల్లడించాయి.