Vladimir Putin | మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమైన పుతిన్.. రేపు అరబ్ దేశాలకు వెళ్లనున్న రష్యా అధ్యక్షుడు
Vladimir Putin | రష్యా అధ్యక్షుడు పుతిన్ (Vladimir Putin) విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. బుధవారం సౌదీ అరేబియా (Saudi Arabia), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates)ను పుతిన్ సందర్శించనున్నట్లు క్రెమ్లిన్ (Kremlin) మంగళవారం ప్రకటించింది.
Vladimir Putin | అరెస్ట్ భయంతో గత కొన్ని రోజులుగా దేశ సరిహద్దులు దాటని రష్యా అధ్యక్షుడు పుతిన్ (Vladimir Putin).. ఇప్పుడు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. ఈ ఏడాది మార్చిలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) పుతిన్‌పై అరెస్ట్ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన విదేశీ పర్యటనలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అన్ని సదస్సుల్లోనూ వర్చువల్‌గా ప్లా్ల్గొంటున్నారు. అయితే, అరెస్ట్ వారెంట్ తర్వాత అక్టోబర్‌లో చైనాలో తన తొలి విదేశీ పర్యటను ముగించుకున్న పుతిన్… తాజాగా అరబ్ దేశాల పర్యటనకు సిద్ధమయ్యారు.
బుధవారం సౌదీ అరేబియా (Saudi Arabia), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates)ను పుతిన్ సందర్శించనున్నట్లు క్రెమ్లిన్ (Kremlin) మంగళవారం ప్రకటించింది. ‘అధ్యక్షుడు పుతిన్ రేపు యూఏఈ, సౌదీ అరేబియా పర్యటనకు వెళ్తున్నారు’ అని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ (Dmitry Peskov) తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలు, ఇజ్రాయెల్ – హమాస్ మధ్య వివాదం, అంతర్జాతీయ రాజకీయాలపై రష్యా అధినేత చర్చిస్తారని ఆయన చెప్పారు.
కాగా, యుద్ధ నేరాల కేసులో పుతిన్‌ను అంతర్జాతీయ కోర్టు దోషిగా నిర్ధారించింది. రష్యా అధినేత అరెస్టుకు గత మార్చిలో ఆదేశాలు జారీచేసింది. దీంతో పుతిన్ గత కొన్ని రోజులు విదేశీ పర్యటనలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆగస్ట్‌లో దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి కూడా పుతిన్ గైర్హాజరయ్యారు. సెప్టెంబర్‌లో భారత్ వేదికగా జరిగిన జీ20 సమావేశాలకు కూడా ఆయన హాజరుకాలేదు. ఆ తర్వాత తొలిసారి అక్టోబర్‌లో దేశ సరిహద్దులు దాటి చైనాలో పర్యటించారు. బీజింగ్‌లో జరిగిన బెల్ట్ అండ్ రోడ్ సదస్సు (Belt and Road forum)కు మాత్రమే పుతిన్ హాజరయ్యారు. ఇప్పుడు అరబ్ దేశాల పర్యటకు వెళ్తున్నారు.
పుతిన్‌పై అరెస్ట్ వారెంట్
ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు గానూ ఈ ఏడాది మార్చిలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) పుతిన్‌పై అరెస్ట్ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్(Ukraine)లోని పిల్లల్ని చట్టవ్యతిరేకంగా డిపోర్ట్ (Deport) చేసినట్లు పుతిన్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హేగ్‌లోని ఐసీసీ.. రష్యాకు చెందిన చిల్డ్రన్ రైట్స్ కమిషనర్ మారియా లోవా బెలోవాకు కూడా అరెస్టు వారెంట్ జారీ చేసింది.
ఐసీసీ ఆదేశాల ప్రకారం.. ఒకవేళ పుతిన్ ఏదైనా ఐసీసీ సభ్య దేశంలో అడుగుపెడితే, అప్పుడు అతన్ని అరెస్టు చేసే అవకాశాలు ఉంటాయి. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో సుమారు 120 సభ్య దేశాలు ఉన్నాయి. అయితే వారెంట్‌ను అమలు చేసే పరిస్థితి మాత్రం అంతర్జాతీయ దేశాల సహకారంపై ఆధారపడి ఉంటుంది.
Also Read..
Childrens Missing | 24 గంటల వ్యవధిలో ఆరుగురు చిన్నారులు అదృశ్యం..
INDIA bloc meet | ఇండియా కూటమిలో విభేదాలు..! రేపు ఢిల్లీలో జరగాల్సిన మీటింగ్ వాయిదా
Byjus | ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు.. ఇంటిని తాకట్టు పెట్టిన బైజూస్ ఫౌండర్!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

