Childrens Missing | 24 గంటల వ్యవధిలో ఆరుగురు చిన్నారులు అదృశ్యం..
Childrens Missing | మహారాష్ట్రలో ఒకే రోజు ఏకంగా ఆరుగురు చిన్నారులు కనిపించకుండా (Childrens Missing) పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆదివారం నుంచి సోమవారం వరకూ 24 గంటల వ్యవధిలో ఆరుగురు చిన్నారులు అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు.
Childrens Missing | మహారాష్ట్రలో ఒకే రోజు ఏకంగా ఆరుగురు చిన్నారులు కనిపించకుండా (Childrens Missing) పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆదివారం నుంచి సోమవారం వరకూ 24 గంటల వ్యవధిలో ఆరుగురు చిన్నారులు అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. థానే జిల్లాలోని (Thane district) నవీ ముంబై టౌన్షిప్ (Navi Mumbai township) పరిసర ప్రాంతాల నుంచి వీరంతా మిస్సైనట్లు వెల్లడించారు. కనిపించకుండా పోయిన వారిలో నలుగురు మైనర్ బాలికలు కాగా, ఇద్దరు బాలురు. అయితే, ఓ బాలుడు మాత్రం తిరిగి తన కుటుంబం వద్దకు చేరినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన (Police) వివరాల ప్రకారం.. 12 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న మైనర్లు డిసెంబర్ 3 నుంచి 4 మధ్య కనిపించకుండా పోయారు. అందులో కలంబోలి (Kalamboli) ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల బాలిక ఆదివారం తన క్లాస్మేట్ పుట్టినరోజు వేడుకలకు అని వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. మరో కేసులో పన్వేల్ (Panvel)కు చెందిన 14 ఏళ్ల బాలిక ఆదివారం తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. అయితే అక్కడి నుంచి తిరిగి రాలేదు. కమోతే (Kamothe) ప్రాంతంలో 12 ఏళ్ల బాలిక సోమవారం తన ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయింది.
రబలే (Rabale) ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల బాలిక సైతం సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఇక అదే ప్రాంతానికి (రబలే) చెందిన 13 ఏళ్ల బాలుడు కూడా సోమవారం తెల్లవారుజామున టాయిలెట్కని వెళ్లాడు. ఇక అప్పటి నుంచి ఆ బాలుడి జాడ తెలియరాలేదు. ఇక కోపర్ఖైర్నే (Koparkhairne) ప్రాంతం నుంచి తప్పిపోయిన ఓ 12 ఏళ్ల బాలుడు మాత్రం కాసేపటికి తిరిగి తన కుటుంబాన్ని కలుసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మిస్సింగ్ ఘటనలపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు చెప్పారు. పిల్లల జాడ కోసం గాలింపు చేపడుతున్నట్లు వారు వివరించారు.
Also Read..
INDIA bloc meet | ఇండియా కూటమిలో విభేదాలు..! రేపు ఢిల్లీలో జరగాల్సిన మీటింగ్ వాయిదా
Byjus | ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు.. ఇంటిని తాకట్టు పెట్టిన బైజూస్ ఫౌండర్!
Actor Vishal | మీలా మేం సురక్షితంగా లేం.. విశాల్ అసహనం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

