మాస్కో, జనవరి 13: రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఇక రిటైర్ కావాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. త్వరలోనే ఆయన తన రాజకీయ వారసుడిని ప్రకటించబోతున్నారని పుతిన్‌కు చాలా కాలం సన్నిహితంగా ఉండి ఇటీవలే దూరమైన గల్యామోవ్ ఒక వార్తాసంస్థతో చెప్పారు.
పుతిన్‌కు గల్యామోవ్ స్పీచ్ రైటర్‌గా కూడా పని చేశారు. ఒకప్పుడు తిరుగులేని ప్రజాదరణ, దేశంలో పట్టు సంపాదించుకున్న పుతిన్‌పై ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన తర్వాత వ్యతిరేకత పెరుగుతున్నదని ఆయన పేర్కొన్నారు.