మాస్కో: అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్తో.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) భేటీకానున్నారు. ఉక్రెయిన్ యుద్ధానికి అంతం పలికేందుకు ఆ ఇద్దరు భేటీకానున్నారు. అయితే శాంతి ఒప్పందంపై ఓ అగ్రిమెంట్ జరిగే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ కూడా ఆ చర్చల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఫ్లోరిడాలో రెండు రోజుల పాటు ఉక్రెయిన్ , అమెరికా అధికారుల మధ్య చర్చలు జరిగాయి. విట్కాఫ్, కుష్నర్ కూడా ఆ చర్చల్లో పాల్గొన్నారు. అయితే రష్యాకు అనుకూలమైన శాంతి ప్రణాళికను రూపొందించే ఉద్దేశంతో అమెరికా ప్రయత్నాలు చేస్తున్నది. అమెరికాలో జరిగిన చర్చలు నిర్మాణాతంగా సాగినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు.