న్యూఢిల్లీ: హొర్ముజ్ జలసంధిలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా షిప్పింగ్ కంపెనీలను సురక్షితమైన, మరింత నమ్మకమైన రవాణా మార్గాల కోసం అన్వేషించేలా చేస్తున్నాయి. ఈ మార్పుతో కేరళలోని విజింజం నౌకాశ్రయం ఒక వ్యూహాత్మక ప్రత్యామ్నాయ మధ్యంతర రవాణా పోర్ట్ హబ్‌గా ప్రపంచ దృష్టిని ఆకట్టుకుంటున్నది.
ప్రస్తుతం ఈ ఓడరేవు ఒక నమ్మకమైన సముద్ర వాణిజ్య కేంద్రంగా ఆవిర్భవించిందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ శనివారం పేర్కొన్నారు. 100 నౌకలు, ఒకే గమ్యం. నా నియోజకవర్గంలోని విజింజం పోర్టులో ప్రస్తుతం 100 ఓడలు వరుసలో ఉన్నాయి అని ఎక్స్ పోస్టు థరూర్ పేర్కొన్నారు. విజింజం పోర్టు దేశంలోనే మొట్టమొదటి లోతైన నీటి ట్రాన్స్షిప్మెంట్ హబ్‌గా ఇప్పటికే గుర్తింపు పొందింది.