Viral Video | షారూఖ్ ఖాన్ పాటకు స్టెప్పులేస్తూ.. ప్రియురాలికి పెండ్లి ప్రపోజల్..!
Viral Video | మరి షారూఖ్ ఖాన్ నుంచి ఇన్స్పిరేషన్ పొందాడో ఏమో.. ఓ వ్యక్తి షారూఖ్ నటించిన 'కుచ్ కుచ్ హోతా హై' సినిమాలోని 'కోయీ మిల్ గయా..' పాటకు స్టెప్పులేస్తూ
Viral Video: షారూఖ్ ఖాన్..! బాలీవుడ్లో బాగా పేరుమోసిన హీరో..! దేశంలో రొమాంటిక్ రారాజుగా గర్తింపు కలిగిన మెగాస్టార్..! వివిధ సినిమాల్లో లవర్ బాయ్ పాత్రలు పోషించి ప్రేమకు కొత్త భాష్యం చెప్పిన గొప్ప నటుడు..! మరి షారూఖ్ ఖాన్ నుంచి ఇన్స్పిరేషన్ పొందాడో ఏమో.. ఓ వ్యక్తి షారూఖ్ నటించిన ‘కుచ్ కుచ్ హోతా హై’ సినిమాలోని ‘కోయీ మిల్ గయా..’ పాటకు స్టెప్పులేస్తూ తన ప్రియురాలికి పెండ్లి ప్రతిపాదన చేశాడు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నది. తన ప్రపోజల్ మరింత ప్రత్యేకంగా ఉండాలనుకున్నాడో ఏమో.. అతను పారిస్లోని ఈఫిల్ టవర్ ముందు ఈ వీడియో చేశాడు. వీడియోలో అతను డ్యాన్స్ చేస్తూ ప్రపోజ్ చేస్తుంటే.. ఆమె ముఖం నిండా ఆశ్చర్యంతో అతనితో అడుగులు కలిపింది. వారి వెనుకాల కొవ్వుత్తుల వెలుగుల నడుమ ఎర్రని రోజా పూలతో తీర్చిదిద్దిన మ్యారీ మీ అనే సింబల్ కనిపిస్తున్నది. ఈ 44 సెకన్ల వీడియోను సచిన్ టాండన్ అనే ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశాడు.
ఈ నెల 15న పోస్టు చేసిన ఈ వీడియోను ఇప్పటికే వేల మంది వీక్షించారు. 18,200 మంది లైక్ చేశారు. 7000 మందికిపైగా కామెంట్ చేశారు. అయితే ఈ కామెంట్లలో అనుకూల కామెంట్లు, ప్రతికూల కామెంట్లు ఉన్నాయి. కొంతమంది అతని క్రియేటివిటీని మెచ్చుకుంటుంటే.. మరి కొంతమంది మాత్రం జనాల దృష్టి మళ్లించడానికి ఇలాంటి వాళ్లు ఏదైనా చేస్తారు అని విమర్శిస్తున్నారు. ఈ వీడియోను మీరూ ఒకసారి చూసి.. మీకు ఏమినిస్తే అది కామెంట్ చేయండి..
😭😭
I don’t know who this gentleman is. I’m sure he means well.
But no. JUST NO. pic.twitter.com/f5uibsTZCn— Sachin Tandon (@cugwmui) October 15, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

