లండన్: శాఖాహార జాతికి చెందిన ఒక పెద్ద తాబేలు చిన్న పక్షిని వేటాడి తిన్నది. ఇది చూసిన బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఆశ్చర్యపోయారు. సీషెల్స్‌లోని ఫ్రీగేట్ ద్వీపంలో ఈ ఏడాది జూలైలో ఈ ఘటన జరిగింది. వెజిటేరియన్ జాతికి చెందిన ఒక పెద్ద తాబేలు ఉన్నట్టుండి చెట్టు దుంగపై ఉన్న ఒక చిన్న పక్షి వెంటపడింది. ఆ పక్షి దాని బారి నుంచి తప్పించుకుని దుంగ చివరి వరకు వెళ్లింది. అయితే అక్కడ నుంచి ఆ పక్షి తప్పించుకోలేకపోయింది. ఇంతలో తాబేలు ఒక్కసారిగా తన నోటితో దాని మెడ పట్టుకుని కొరికి తినేసింది.
ఊహించని ఈ ఘటనను చిత్రీకరించిన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం జంతుశాస్త్ర పరిశోధకులు ఇది చూసి నిశ్చేష్టులయ్యారు. సీషెల్స్‌లోని శాఖాహార జాతికి చెందిన ఆ తాబేలు టేస్ట్ కోసం మాంసాహారిగా మారిందా అని ఆశ్చర్యపోయారు. ఆ తాబేలు వేటాడిన విధానం చూస్తే చిన్న పక్షులను వేటాడి తినడం ఆ జాతి తాబేలుకు ఇదే తొలిసారి కాదన్నది అర్థమవుతోందన్నారు. పక్షుల గూళ్ల నుంచి రాలి పడే గుడ్లు, చేపలను తిని అవి మాంసాహారానికి అలవాటు పడి ఉంటాయని పరిశోధకులు భావిస్తున్నారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ట్వీట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Researchers capture on film the unexpected moment when a giant #tortoise – thought to be vegetarian – attacks and eats a tern chick: https://t.co/GsAWXSltRs
— Cambridge University (@Cambridge_Uni) August 23, 2021
Warning: some viewers may find scenes in this film distressing.@Peterhouse_Cam @jstgerlach #Seychelles pic.twitter.com/wOTb7WN9JO