US Woman | రోజూ కాఫీలో కొంచెం విషం కలిపిస్తున్న భార్య.. రహస్య కెమెరాల ద్వారా గుర్తించిన భర్త
US Woman | భర్తను అంతమొందించేందుకు ఓ భార్య మాస్టర్ ప్లాన్ వేసింది. ఎవరికీ అనుమానం రాకుండా భర్త రోజూ తాగే కాఫీ (Coffee)లో కొద్ది కొద్దిగా విషపదార్థాన్ని (Poisoning) కలిపి ఇచ్చింది.
US Woman | భర్తను అంతమొందించేందుకు ఓ భార్య మాస్టర్ ప్లాన్ వేసింది. ఎవరికీ అనుమానం రాకుండా భర్త రోజూ తాగే కాఫీ (Coffee)లో కొద్ది కొద్దిగా విషపదార్థాన్ని (Poisoning) కలిపి ఇచ్చింది. అనుమానం వచ్చిన భర్త రహస్య కెమెరాల ద్వారా భార్య బండారాన్ని బట్టబయలు చేశాడు. ఈ ఘటన అమెరికా (America)లో వెలుగు చూసింది. స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం..
మెలోడీ ఫెలికానో జాన్సన్ (Melody Felicano Johnson), రాబీ జాన్సన్ (Roby Johnson) దంపతులు. వీరు యూఎస్ లోని అరిజోనా (Arizona) రాష్ట్రంలో నివాసం ఉంటున్నారు. రాబీ జాన్సన్ యూఎస్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నాడు. ఈ జంటకు ఒక కుమార్తె కూడా ఉంది. అయితే, రోజూ తన భర్త తాగే కాఫీలో మెలోడీ విష పదార్థాన్ని కలిపి ఇచ్చేది. ఇలా నెలల తరబడి చేస్తోంది. అయితే కాఫీ రుచిలో తేడా గమనించిన రాబీ.. మార్చి నుంచి భార్యపై ఓ కన్నేశాడు. తనకు ఇచ్చే కాఫీలో ఏదో కలుపుతోందని గ్రహించి మెలోడీకి తెలియకుండా ఇంట్లో రహస్య కెమెరాలను ఏర్పాటు చేశాడు. తనకు ఇచ్చే కాఫీలో ఏదో పదార్థాన్ని కలిపే విషయాన్ని రహస్య కెమెరా ద్వారా గుర్తించాడు. అయితే భార్యకు అనుమానం రాకుండా తను ఇచ్చే కాఫీ తాగుతున్నట్లుగా నటించే వాడు. అలా కొన్ని రోజులకు పూర్తి ఆధారాలు సేకరించి భార్య బండారాన్ని బట్టబయలు చేశాడు.
భార్య తనను చంపేందుకు కుట్ర పన్నిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మెలోడీ కాఫీలో విషపదార్థాన్ని కలుపుతున్న వీడియోలను పోలీసులకు అందించాడు. రాబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెలోడీని పోలీసులు అరెస్ట్ చేశారు. భర్త చనిపోయాక వచ్చే ప్రయోజనాల కోసం ఆమె ఇలా చేసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
Also Read..
Samantha | గాయని చిన్మయి పిల్లలతో సమంత ఆటలు
Rahul Gandhi | లోక్ సభలో అడుగుపెట్టిన రాహుల్.. ట్విట్టర్ బయోలో కీలక మార్పు
Vande Bharat Train | వందేభారత్ పై ఆగని దాడులు.. రైలుపై మరోసారి రాళ్లు రువ్విన ఆకతాయిలు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

