వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌కు అణ్వాయుధాలను ఇవ్వబోమని అమెరికా తేల్చిచెప్పింది. సోవియట్ యూనియన్ పతనానంతరం ఉక్రెయిన్ వదులుకున్న అణ్వాయుధాలను తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదని ‘వైట్ హౌస్’ స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే ముందు ఉక్రెయిన్‌కు అణ్వాయుధాలు ఇవ్వాలని కొందరు అధికారులు బైడెన్‌కు సూచించినట్టు వచ్చిన వార్తా కథనంపై ‘వైట్ హౌస్’ జాతీయ భద్రతా సలహాదారు ఈ ప్రకటన చేశారు.