US strikes : తాను ఏడు యుద్ధాలను ఆపానని పదేపదే చెప్పుకొంటున్న అమెరికా అధ్యక్షుడు (US president) డొపాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా ఓ కొత్త యుద్ధానికి తెరతీశారు. ఆ మేరకు కరేబియన్ సముద్రంలో భారీ యుద్ధ నౌకలు (War ships), జలాంతర్గాములు, అత్యాధునిక ఫైటర్జెట్ (Fighter jets) లను మోహరించారు.
ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న వెనెజువెలా చుట్టూ ఇవి సమయం కోసం ఎదురుచూస్తూ కాచుకు కూర్చున్నాయి. దాంతో కరేబియన్ జలాలపై యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణమైనా అమెరికా దళాలు వెనెజువెలాలో చొరబడవచ్చని ప్రచారం జరుగుతోంది. వెనెజువెలా ముఠాల నుంచి మాదకద్రవ్యాలు అమెరికాను ముంచెత్తుతున్నాయని ట్రంప్ చాలాకాలంగా చెబుతూవస్తున్నారు.
ఇప్పుడు ఆ ముఠాలను అంతం చేసేందుకు సైనికదళాలను రంగంలోకి దింపారు. మాదకద్రవ్యాల ముఠాలతో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోకు సంబంధాలున్నాయని ట్రంప్ కార్యవర్గం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అతడిని పట్టించే సమాచారం ఇస్తే ఏకంగా 50 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.430 కోట్లు) బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. అంతేగాక మదురో సర్కారు ఇక రోజులు లెక్కపెట్టుకోవాలని ట్రంప్ స్వయంగా సోషల్ మీడియాలో హెచ్చరించారు.