న్యూయార్క్, జనవరి 16: భూమికి అత్యంత ముప్పుగా పరిణమించిన ప్లాస్టిక్ నుంచి బొగ్గును తయారు చేశారు అమెరికా పరిశోధకులు. స్టిరోఫోమ్ ప్యాకేజీకి ఉపయోగించే పాలిస్టిరీన్, వాటర్ బాటిళ్ల తయారీకి వాడే పాలి ఇథిలీన్ టెరాఫ్తలేట్ (పీఈటీ) అనే రెండు రకాల ప్లాస్టిక్ల నుంచి ఈ బొగ్గును ఆవిష్కరించారు.
వీటిని మక్కజొన్న పంట ఉప ఉత్పత్తి అయిన కార్న్ స్టవర్కు కలుపడం ద్వారా బయోచార్ (బొగ్గు అధిక కార్బన్ రూపం)ను రూపొందించారు. ఈ బయోచార్ నేలలో నీటి నిలుపుదల సామర్థ్యాన్ని పెంచి సారవంతం చేస్తుంది. కాగా, ఈ ప్లాస్టిక్ నుంచి నీటిని ఫిల్టర్ చేసే చార్కోల్ తయారీపై కూడా ప్రయోగాలు చేస్తున్నట్టు పరిశోధనకు నేతృత్వం వహించిన కాండిస్ లెస్టీ అబ్దుల అజీజ్ తెలిపారు.