వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైకిల్ పై నుంచి కింద పడ్డారు. అయితే వెంటనే పైకి లేచిన ఆయన తాను బాగానే ఉన్నట్లు తెలిపారు. కాగా, బైడెన్‌కు ఎలాంటి దెబ్బలు తగలలేదని వైట్‌హౌస్ పేర్కొంది. అమెరికా చరిత్రలోనే అత్యంత వృద్ధ అధ్యక్షుడైన 79 ఏళ్ల జో బైడెన్, డెలావేర్ రాష్ట్రంలోని బీచ్ హోమ్ వద్ద కుటుంబంతో గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం భార్య, ఆ దేశ ప్రథమ మహిళ జిల్ బైడెన్‌తో కలిసి రెహోబోత్ బీచ్‌లోని వారి బీచ్ ఇంటికి సమీపంలో ఉన్న స్టేట్ పార్క్‌లో సైకిల్ తొక్కారు.
అనంతరం అక్కడ గుమిగూడిన స్థానికులు, మీడియాతో మాట్లాడేందుకు బైడెన్ సైకిల్ ఆపారు. ఈ క్రమంలో పట్టు తప్పిన ఆయన సైకిల్‌తో సహా కింద పడిపోయారు. వెంటనే పైకి లేచిన బైడెన్ తాను బాగానే ఉన్నానని తెలిపారు. సైకిల్ పెడల్ పై నుంచి కాలును ఒక్కసారిగా తీయడంతో బ్యాలెన్స్ కోల్పోయినట్లు చెప్పారు. అయితే ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని, వైద్యం అవసరం లేదని వైట్‌హౌస్ కార్యాలయం పేర్కొంది.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైకిల్ పై నుంచి కింద పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు. ‘బ్రేకింగ్ న్యూస్! బైడెన్ సైకిల్‌ను పుతిన్ అడ్డుకుని ఆయన పడిపోయేలా చేశారు’ అంటూ ఒకరు చమత్కరించారు.
BBC CNN
Breaking News! Putin sabotaged Biden‘s Bike to make him fall! pic.twitter.com/lmqqjetGc7
— Levi (@Levi_godman) June 18, 2022