బైడెన్‌కు క్షీణిస్తున్న జ్ఞాపకశక్తి.. అమెరికా అధ్యక్షుడి వీడియో వైరల్
Joe Biden:అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు జ్ఞాపక శక్తి క్షీణిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవల ఓ సమావేశంలో చనిపోయిన సేనేటర్ను ఇక్కడే ఉన్నట్లు గుర్తు చేసిన బైడెన్.. తాజాగా ఫెమా మీటింగ్‌లోనూ తన ప్రసంగం
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు జ్ఞాపక శక్తి క్షీణిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవల ఓ సమావేశంలో చనిపోయిన సేనేటర్ను ఇక్కడే ఉన్నట్లు గుర్తు చేసిన బైడెన్.. తాజాగా ఫెమా మీటింగ్‌లోనూ తన ప్రసంగం ముగించిన తర్వాత దారి తప్పి మరో వైపు వెళ్లారు. దీంతో తాజా వీడయో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. హరికేన్ ఇయాన్ నేపథ్యంలో ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఆఫీసుకు వెళ్లిన బైడెన్ అక్కడ ఉన్న ఆఫీసర్లను ఉద్దేశించి ప్రసంగించారు. స్పీచ్ ముగిసిన తర్వాత కుడి వైపు మళ్లి ముందుకు కదిలారు. కానీ పక్కన ఉన్న ఫెమా అధికారులు పిలుస్తున్నా ఆయన పట్టించుకోలేదు. ఈ ఘటనకు సంబంధించిన ఓ చిన్న వీడియో వైరల్ అవుతోంది. ప్రసంగం ముగించి థ్యాంక్స్ చెప్పిన బైడెన్.. మరో దిశగా వెళ్లడం అందర్నీ స్టన్ చేసింది. ఆ తర్వాత అక్కడ ఉన్న కొందరితో షేక్ హ్యాండ్ చేశారు. ఈ వీడియో చూసిన ట్విట్టర్ యూజర్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. బైడెన్ ఫిట్‌గా లేరన్న కామెంట్లు కూడా వస్తున్నాయి.
"Mr. President………?" pic.twitter.com/DOdTltF6g1
— RNC Research (@RNCResearch) September 29, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

