వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) తన సోషల్ మీడియా అకౌంట్ ట్రుత్ సోషల్‌లో వివాదాస్పద పోస్టు చేశారు. వెనిజులా దేశాన్ని 51వ అమెరికా రాష్ట్రంగా చూపిస్తూ ఓ పోస్టు చేశారు. ఇక విదేశాంగ శాఖ మంత్రి మార్కో రోబో ఫోటోను కూడా షేర్ చేశారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాడురోను నిర్బంధించిన సమయంలో ఆయన నైక్ ట్రాక్ సూట్ వేసుకున్నారు. అయితే అలాంటి ట్రాక్ సూట్ వేసుకున్న మార్కో రూబియో ఫోటోను కూడా ట్రంప్ షేర్ చేశారు. ఎయిర్ ఫోర్స్ వన్‌లో రూబియో ప్రయాణిస్తున్నట్లు పేర్కొన్నారు.
చైనా అధ్యక్షుడు జీ జిన్ఫింగ్తో సమావేశం అయ్యేందుకు ట్రంప్ చైనా టూరు వెళ్తున్నారు. అయితే వెళ్లేముందు ఆయన ఈ పోస్టు చేశారు. వైట్‌హౌజ్ కూడా ఈ ఫోటోలను తన ఎక్స్ అకౌంట్లో రిలీజ్ చేసింది. వెనిజులాను కొత్త రాష్ట్రంగా పరిగణించాలని భావిస్తున్నట్లు ఇటీవల ఫాక్స్ న్యూస్‌తో ట్రంప్ పేర్కొన్నారు. మిలిటరీ ఆపరేషన్ ద్వారా కారకాస్ నుంచి మాడురోను అమెరికా కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే.
వెనిజులాపై ట్రంప్ చేసిన పోస్టును ఆ దేశ తాత్కాలిక అధ్యక్ష డెల్సీ రోడ్రిగ్జ్ తప్పుపట్టారు. ఆ ఐడియాను ఆయన వ్యతిరేకించారు. అమెరికాకు 51వ రాష్ట్రంగా వెనిజులా ఉండబోదని అన్నారు.