Donald Trump | నా జోక్యం వల్లే అణు యుద్ధం తప్పింది.. భారత్, పాక్ కాల్పుల విరమణపై ట్రంప్
Donald Trump | రెండు దేశాలతో వాణిజ్యం నిలిపివేస్తానని బెదిరించి భారత్, పాకిస్థాన్‌ను కాల్పుల విరమణకు ఒప్పించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం వెల్లడించారు. వైట్ హౌస్‌లో విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, మీతో చాలా పెద్ద మొత్తంలో వాణిజ్యం చేయనున్నామని ఆ రెండు దేశాలకు చెప్పానన్నారు.
Donald Trump | వాషింగ్టన్, మే 12: రెండు దేశాలతో వాణిజ్యం నిలిపివేస్తానని బెదిరించి భారత్, పాకిస్థాన్‌ను కాల్పుల విరమణకు ఒప్పించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం వెల్లడించారు. వైట్ హౌస్‌లో విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, మీతో చాలా పెద్ద మొత్తంలో వాణిజ్యం చేయనున్నామని ఆ రెండు దేశాలకు చెప్పానన్నారు. ‘ఇక యుద్ధం ఆపెయ్యండి. మీరు ఆపేస్తే మనం వాణిజ్యం చేద్దాం. మీరు ఆపకపోతే మాతో ఇక మీరు ఎటువంటి వాణిజ్యం చేయలేరు’ అని భారత్, పాక్‌ను బెదిరించానని ట్రంప్ తెలిపారు. హఠాత్తుగా ఆ రెండు దేశాలు కూడా తాము కూడా యుద్ధం ఆపేయాలని ఆలోచిస్తున్నట్టు చెప్పాయని ఆయన అన్నారు. ఆ రెండు దేశాల నిర్ణయాలపై వాణిజ్యం బలమైన ప్రభావం చూపిందని ఆయన చెప్పారు.
‘చాలా కారణాలు ఉండొచ్చు. కాని అందులో వాణిజ్యం చాలా ముఖ్యమైనది’ అని ట్రంప్ వెల్లడించారు. తాను జోక్యం చేసుకున్నందువల్లే రెండు దేశాల మధ్య అణు యుద్ధం తప్పిందని తాను భావిస్తున్నట్టు ఆయన వ్యాఖ్యానించారు. ‘అణు యుద్ధాన్ని మేము ఆపాం. అదో ఘోరమైన అణు యుద్ధం అయ్యేదని నేను భావిస్తున్నాను. లక్షలాది ప్రజలు మరణించి ఉండేవారు’ అని ట్రంప్ తెలిపారు. భారత్, పాక్‌తో అమెరికా పెద్ద ఎత్తున వాణిజ్యం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. భారత్‌తో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే పాకిస్థాన్‌తో కూడా చర్చలు ప్రారంభమవుతాయని ఆయన అన్నారు. రెండు దేశాలు సంక్షోభాన్ని పరిష్కరించుకున్న విధానాన్ని చూసి తాను గర్విస్తున్నానని ఆయన తెలిపారు. ఆ రెండు దేశాలలోని నాయకత్వం స్థిరంగా, శక్తివంతంగా ఉందని చెప్పారు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోగల వివేచన కూడా వారిలో ఉందని ఆయన అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

