US Troops | ఇరాన్‌తో యుద్ధం తీవ్రం.. పశ్చిమాసియాలో 3,500 మంది మెరైన్లను మోహరించిన అమెరికా
US Troops | ఇరాన్ (Iran) తో యుద్ధ వాతావరణం తీవ్రమవుతున్న నేపథ్యంలో అమెరికా (USA) కీలక చర్యలు చేపట్టింది. పశ్చిమాసియాలో తన సైనిక శక్తిని గణనీయంగా పెంచుతూ 3,500 మంది మెరైన్లు నావికులతో కూడిన ఓ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను మోహరించింది. ఈ బలగాలు మార్చి 27న మధ్యప్రాచ్యానికి చేరాయని, అమెరికా సెంట్రల్ కమాండ్ (US Centrel Command) శనివారం ఒక ప్రకటనలో ధ్రువీకరించింది.
US Troops : ఇరాన్ (Iran) తో యుద్ధ వాతావరణం తీవ్రమవుతున్న నేపథ్యంలో అమెరికా (USA) కీలక చర్యలు చేపట్టింది. పశ్చిమాసియాలో తన సైనిక శక్తిని గణనీయంగా పెంచుతూ 3,500 మంది మెరైన్లు నావికులతో కూడిన ఓ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను మోహరించింది. ఈ బలగాలు మార్చి 27న మధ్యప్రాచ్యానికి చేరాయని, అమెరికా సెంట్రల్ కమాండ్ (US Centrel Command) శనివారం ఒక ప్రకటనలో ధ్రువీకరించింది.
యూఎస్ఎస్ ట్రిపోలీ యుద్ధనౌకపై ఈ బలగాలు వచ్చాయని వెల్లడించింది. ఈ బృందంలో దాదాపు 3,500 మంది సైనికులతోపాటు, రవాణా, ఫైటర్ విమానాలు, దాడులకు అవసరమైన ఇతర యుద్ధ సామాగ్రి కూడా ఉన్నాయి. సముద్రం నుంచి నేలపై నుంచి ఏకకాలంలో దాడులు చేయగల సామర్థ్యం ఈ బలగాలకు ఉంది. వ్యూహాత్మక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం, పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, తీరప్రాంత లక్ష్యాలపై దాడులు చేయడం వంటి వేగవంతమైన ఆపరేషన్ల కోసం ఈ తరహా యూనిట్లను ఉపయోగిస్తారు.
ఇదిలావుండగా మధ్యప్రాచ్యానికి మరో 10 వేల మంది సైనికులను పంపే ప్రతిపాదనను పెంటగాన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. దౌత్య మార్గాలతో పాటు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరిన్ని సైనిక ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉంచడమే దీని లక్ష్యమని తెలుస్తోంది. ఈ బలగాలను ఇరాన్‌కు సమీపంలో, ముఖ్యంగా ఆ దేశానికి కీలకమైన చమురు ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ ద్వీపంపై దాడికి వీలుగా ఉండే ప్రాంతాల్లో మోహరించే అవకాశం ఉందని రక్షణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

