Pete Hegseth : అమెరికా రక్షణ మంత్రి (US foreign secretary) పీట్ హెగ్సెత్ (Pete Hegseth) విమానం యూకేలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. విమానం విండ్షీల్డ్ (Windshield) లో పగుళ్లు ఏర్పడటంతో అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు తెలుస్తోంది. బ్రస్సెల్స్ (Brussels) లో నాటో రక్షణ మంత్రుల సమావేశంలో హెగ్సెత్ పాల్గొన్నారు. అక్కడి నుంచి ఆయన తిరిగి అమెరికాకు వస్తుండగా ఈ ఘటన జరిగింది.
ఈ విషయాన్ని పెంటగాన్ కూడా ధ్రువీకరించింది. హెగ్సెత్తో సహా విమానంలోని వారంతా సురక్షితంగా ఉన్నారని పెంటగాన్ ప్రతినిధి సీన్ పార్నెల్ పేర్కొన్నారు. ఇదిలావుంటే నాటో సమావేశంలో ఉక్రెయిన్పై దూకుడుగా వ్యవహరిస్తున్న రష్యాకు హెగ్సెత్ కీలక హెచ్చరికలు చేశారు. మాస్కో దూకుడు ఇలాగే కొనసాగితే అమెరికా మిత్రదేశాలతో కలిసి రష్యాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని, ఉక్రెయిన్ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంపై కూటమి దృష్టి సారిస్తుందని హెచ్చరించారు.