న్యూయార్క్, ఆగస్టు 13: అమెరికా అప్పు మొదటిసారిగా 37 లక్షల కోట్ల డాలర్లు (సుమారు రూ.3,235 లక్షల కోట్లు) దాటిందని ఆ దేశ ఆర్థిక విభాగం వెల్లడించింది. కొవిడ్ కాలానికి ముందు 2020 జనవరిలో బడ్జెట్ కార్యాలయం వేసిన అంచనాను ఇది మించిపోయిందని తెలిపింది. కొవిడ్-19 కాలం దేశ అప్పు పెరగటానికి కారణమని తెలుస్తున్నది. ట్రంప్ తొలి దశ పాలన, ఆ తరువాత జో బైడెన్ హయాంలో సహాయ పునరావాస కార్యక్రమాల కోసం ప్రభుత్వం భారీస్థాయిలో అప్పులు చేసింది. ఈ అప్పు పౌరులపై పెనుభారాన్ని మోపుతున్నది. ఉద్యోగుల వేతనాల తగ్గుతున్నాయి. వస్తు ధరలు పెరుగుతున్నాయి.