Donald Trump: క్యాపిటల్ హిల్‌పై అటాక్.. డోనాల్డ్ ట్రంప్‌కు సమన్లు !
Donald Trump:ఏడాది క్రితం అమెరికాలోని క్యాపిటల్ హిల్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటనతో లింకున్న మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు సమన్లు జారీ చేయనున్నారు. క్యాపిటల్ అటాక్ కేసులో ట్రంప్‌ను విచారించాలని
న్యూయార్క్: ఏడాది క్రితం అమెరికాలోని క్యాపిటల్ హిల్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటనతో లింకున్న మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump)కు సమన్లు జారీ చేయనున్నారు. క్యాపిటల్ అటాక్ కేసులో ట్రంప్‌ను విచారించాలని యూఎస్ కాంట్రెస్ కమిటీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆయనకు సమన్లు జారీ చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఆ రోజు జరిగిన చర్యలపై ట్రంప్ వివరణ ఇవ్వాల్సి ఉందని డెమోక్రాట్ బెన్నీ థామ్సన్ తెలిపారు. ఒకవేళ సమన్లకు ట్రంప్ స్పందించకుంటే ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. జైలు శిక్ష కూడా పడే ఛాన్సుంది.
2021 జనవరి ఆరో తేదీన క్యాపిటల్ హిల్‌పై దాడి జరిగింది. ట్రంప్ మద్దతుదారులు ఆ దాడికి దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ట్రంప్ రెచ్చగొట్టడం వల్ల ఆ దాడి జరిగినట్లు విమర్శలు వస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తట్టుకోలేక ట్రంప్ ఆ చర్యకు దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అటాక్ కేసును విచారిస్తున్న కాంగ్రెస్ ప్యానల్లో ఏడు మంది డెమోక్రాట్లు, ఇద్దరు రిపబ్లికన్లు ఉన్నారు. అయితే ఆ 9 మంది ఏకగ్రీవంగా ట్రంప్‌ను విచారించాలని నిర్ణయించారు. దాని కోసం సమన్లు జారీ చేయాలని కూడా డిసైడ్ అయ్యారు.
మరికొన్ని రోజుల్లో ఆ సమన్లు ట్రంప్‌కు అందే అవకాశాలు ఉన్నాయి. విచారణకు హాజరయ్యేందుకు డెడ్‌లైన్ కూడా ఇవ్వనున్నారు. అటాక్‌కు కారణమైన వ్యక్తి నుంచి అనేక అంశాలను రాబట్టాలని చూస్తున్నట్లు కమిటీ వైస్ చైర్మెన్ లిజ్ చెనాయ్ తెలిపారు. ఎన్నికల్లో ఓటమిని అంగీకరించిన ట్రంప్ ఆ సమయంలో ఎలాంటి మైండ్‌తో ఉన్నారో తెలుసుకునేందుకు విచారణ చేపట్టనున్నట్లు కమిటీ తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

