వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో చిన్నారులకు కరోనా వ్యాక్సినేషన్‌కు రంగం సిద్ధమయింది. 5-11 ఏండ్ల చిన్నారులకు ఫైజర్-బయోఎన్‌టెక్ కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడానికి దేశ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఫైజర్ (Pfizer) వ్యాక్సిన్‌కు ఇప్పటికే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అనుమతిచ్చింది. తాజాగా చిన్నారులకు వ్యాక్సిన్ ఇవ్వడానికి సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఆమోదించింది. దీంతో 2.8 కోట్ల మంది పిల్లలకు టీకాలు వేయడానికి మార్గం సుగమయింది.
దీంతో 5-11 ఏండ్ల చిన్నారులకు వ్యాక్సినేషన్‌కు అవసరమైన డోసులను సేకరించిన ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా తరలించడం ప్రారంభించింది. ఈనెల 8 నాటికి ఈ ప్రక్రియ మరింత పుంజుకనే అవకాశం ఉందని వైట్ హౌస్ కోవిడ్-19 కోఆర్డినేటర్ జెఫ్ జియంట్స్ చెప్పారు.