UNO Shock For Russia | ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యాకు ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో ఎదురు దెబ్బ తగిలింది. అంతర్జాతీయ మానవ హక్కుల మండలిలో రష్యా సభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తూ ఐరాస సాధారణ అసెంబ్లీ గురువారం నిర్ణయం తీసుకున్నది. ఉక్రెయిన్లోని బుచా పట్టణంలో రష్యా బలగాలు పౌరుల ఊచకోతకు పాల్పడ్డాయన్న ఆరోపణలు వచ్చాయి. మృతదేహాలను సామూహికంగా ఖననం చేసిన దృశ్యాలు వెలుగు చూశాయి.
బుచా పట్టణంతోపాటు ఉక్రెయిన్ రాజధాని కీవ్ తదితర పట్టణాలు, నగరాల్లోనూ రష్యా బలగాలు సామాన్య పౌరులను చంపేసినట్లు ఆధారాలు లభించాయి. కానీ తమ సైనిక బలగాలు ఉక్రెయిన్ పౌరులను చంపలేదని రష్యా వాదిస్తున్నది. బుచా పట్టణంలో మారణకాండ.. ప్రపంచ దేశాలను షాక్కు గురి చేసింది. దీంతో రష్యాను కట్టడి చేసేందుకు అమెరికా, దాని మిత్ర దేశాలు మరిన్ని ఆంక్షలు విధించనున్నాయి.
ఉక్రెయిన్ పౌరుల మరణాలకు బాధ్యత వహించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిరాకరించారు. బుచా పట్టణంలో ఉక్రెయిన్ అధికారులే క్రూరంగా, రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఆరోపించారు.