రష్యాలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయాన్ని మూసేశారు. అక్కడి సిబ్బంది కూడా వెళ్లిపోయారు. దీంతో పాటు ఉక్రెయిన్ రాయబార కార్యాలయ గేట్లను కూడా సీల్ చేసేశారు. ఇక.. కార్యాలయంపై ఉండే ఉక్రెయిన్ జాతీయ జెండాను కూడా కిందికి దించేశారు.
రష్యా సేనలు దూసుకువెళ్తున్నాయి. ఉక్రెయిన్‌లోని ఒక్కొక్క నగరాన్ని చేజిక్కించుకుంటున్నాయి. తాజాగా ఖేర్సన్ పట్టణాన్ని రష్యా బలగాలు ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దక్షిణ ప్రాంత నగరమైన ఖేర్సన్ను స్వాధీనం చేసుకున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ కార్యాలయం పేర్కొన్నది. ఒకవేళ ఖేర్సన్ నగరం రష్యా చేతుల్లోకి వెళ్తే, అప్పుడు ఆ దేశం స్వాధీనం చేసుకున్న అతిపెద్ద ఉక్రెయిన్ నగరం ఇదే అవుతుంది. నిన్న రాత్రి ఆ నగర వీధుల్లో ఉన్న రష్యా బలగాలు.. ఖేర్సన్ రైల్వే స్టేషన్‌ను, పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.