రష్యా ఉక్రెయిన్‌పై బాంబులతో విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. అయితే రష్యా తమపై కచ్చితంగా దాడులకు దిగుతుందని ముందే గ్రహించిన ఉక్రెయిన్… ప్రజల కోసం షెల్టర్ హోమ్స్ ను తయారు చేసింది. ప్రజలందరూ అందులోకి వెళ్లి తలదాచుకోవాలని సూచిస్తున్నారు. వీటితో పాటు మెట్రో స్టేషన్లలో కూడా తలదాచుకుంటున్నారు. ఇప్పటి వరకూ దాదాపు 5,000 షెల్టర్ హోమ్‌లను ఉక్రెయిన్ తయారు చేసింది.
అయితే కొన్ని సంవత్సరాల క్రిందటే ముందు జాగ్రత్తగా ఉక్రెయిన్ సర్కార్ ఈ బాంబు షెల్టర్లను తయారు చేసి ఉంచింది. ఆకాశం పై నుంచి బాంబులు విసిరినా సరే… ప్రజలకు ఇబ్బందులేమీ లేకుండా ఉండేందుకే ఇవి తయారు చేశారు. యుక్రెయిన్‌లోని దుకాణాలు, బార్లు, మెట్రో స్టేషన్లు, కోల్డ్‌వార్ న్యూక్లియర్ షెల్టర్.. లాంటి వాటిని ముందే తయారు చేశారు. ప్రజలందరూ ఈ షెల్టర్‌లోకి వెళ్లిపోవాలని సూచిస్తున్నారు.
ఉక్రెయిన్ రష్యా బలగాలు దాడులకు దిగుతున్నాయి. సరిహద్దుల్లోకి ప్రవేశించి మరీ విరుచుకుపడుతున్నాయి. దీంతీ వందలాది ఉక్రెయిన్ ప్రజలు మరణించారు. ఒక్కసారిగా రష్యా ఇలా విరుచుకుపడుతుండటంతో ఉక్రెయిన్ ప్రజలు విలవిల్లాడిపోతున్నారు.