రష్యా దురాక్రమణను నిలువరించండి.. అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఉక్రెయిన్
కీవ్: రష్యా దురాక్రమణపై అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే)ను ఉక్రెయిన్ ఆశ్రయించింది. అక్రమంగా తమ దేశంపై దాడి చేసి మారణ హోమాన్ని సృష్టిస్తున్న రష్యాపై చర్యలు కోరుతూ ఐసీజేకు దరఖాస్తు చేసింది. సైనిక కార్యకలాపాలను తక్షణం నిలిపివేసేలా రష్యాను ఆదేశించే అత్యవసర నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థించింది. తమ దరఖాస్తుపై విచారణ వచ్చే వారంలో ప్రారంభమవుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు.
కాగా, ఉక్రెయిన్తో రష్యా యుద్ధం ఆదివారం నాటికి నాలుగో రోజుకు చేరింది. ఆ దేశంపై అన్నివైపుల నుంచి దాడిని తీవ్రం చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ తన ఆర్మీని ఆదేశించారు. అలాగే ఉక్రెయిన్లో తెగువ చూపుతున్న సాయుధ, ప్రత్యేక ఆపరేషన్ బలగాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
మరోవైపు రష్యా దళాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ వైపునకు దూసుకెళ్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్ రెండో పెద్ద నగరమైన ఖార్కీవ్కు రష్యా దళాలు చేరాయి. అయితే ఉక్రెయిన్ ఆర్మీ కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నది. ఖార్కీవ్లోని ఒక స్కూల్లో దాగిన రష్యన్ దళాలతో ఉక్రెయిన్ సైన్యం, వాలంటీర్లు పోరాడారు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
In #Kharkiv, volunteers and the #Ukrainian Armed Forces are fighting the occupants hiding in a school. pic.twitter.com/oGDJSa7brt
— NEXTA (@nexta_tv) February 27, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

