మాస్కో : రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న తరుణం పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మాస్కోలో పర్యటించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాక్ ప్రధాని పర్యటన వార్తలపై పాక్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. ప్రస్తుతం మాస్కో పర్యటనలో ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలతో అంతర్జాతీయ సమాజం చూపు మొత్తంపై పాక్‌పైనే పడింది. రష్యా చేరిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ‘నేను సరైన సమయానికి ఇక్కడికి వచ్చాను. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను’ అన్నారు. ఆయన వెంట్ పాక్ విదేశాంగ మంత్రి షా ఖురేషీ ఉన్నారు. పాక్ ప్రధాని రష్యా పర్యటనపై అమెరికా ఘాటుగానే స్పందించింది. ఉక్రెయిన్‌లో రష్యా కార్యకలాపాలపై అభ్యంతరం చెప్పాలని బాధ్యత ప్రతి ‘బాధ్యతగల’ దేశానికి ఉందని అమెరికా పేర్కొంటూ పాక్ తన బాధ్యతను గుర్తు చేసింది అమెరికా.
అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్‌ప్రైస్ బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాస్కోలో ఇమ్రాన్, పుతిన్‌ల భేటీపై విలేకరుల ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి సంబంధించి తమ వైఖరిని పాక్‌కు తెలియజేశామన్నారు. ఇమ్రాన్‌ఖాన్ రెండు రోజులు రష్యాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పాక్ ప్రధాని వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమై ఆర్థిక సహకారంతో సహా పలు అంశాలపై చర్చించనున్నారు. రష్యా సైన్యం ఉక్రెయిన్‌పై దాడి చేసి నిరంతరం బాంబుల వర్షం కురిపిస్తున్న తరుణంలో ఇమ్రాన్ ఖాన్ రష్యా చేరుకున్నారు. రాజధాని కీవ్‌తోపాటు వివిధ నగరాల్లో గురువారం ఉదయం నుంచి బాంబు, రాకెడ్ దాడులు జరుగుతున్నాయి. అదే సమయంలో సైనికులతో పాటు సాధారణ పౌరులు సైతం రష్యా దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వార్తలు వెలుగులోకి వచ్చాయి.