బ్రిటన్లో ఐదు నెలల గరిష్ఠానికి కరోనా కేసులు

లండన్: బ్రిటన్లో కరోనా కేసుల పెరుగుదల ఆందోళన రేపుతున్నది. రోజువారీ కేసుల నమోదు ఐదు నెలల గరిష్ఠానికి చేరింది. ఆ దేశంలో శుక్రవారం 35 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. జనవరి 22 తర్వాత బ్రిటన్లో గరిష్ఠ సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అక్కడ గత వారం రోజులుగా పది లక్షల జనాభాలో సగటున 410 మంది ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. ప్రపంచ గణాంకాలతో పోల్చితే ఈ సంఖ్య చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో బ్రిటన్లో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందేమోనని వైద్య రంగానికి చెందిన నిఫుణులు అనుమానం వ్యక్తం చేశారు.
మరోవైపు ఈ నెల 19 నుంచి బ్రిటన్ సాధారణ స్థితికి వస్తుందని, అన్నీ తెరుచుకుంటాయని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. జూలై 19ను “స్వేచ్ఛా దినోత్సవం”గా ఆయన అభివర్ణించారు. అయితే ఈ ప్రకటనపై ఆ దేశ ఆరోగ్య, వైద్య రంగ నిఫుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండగా మరోవైపు ఈ నెల 19 నుంచి సాధారణ పరిస్థితి నెలకొననుండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించకపోతే కరోనా ముప్పు మరింతగా పెరిగే ప్రమాదమున్నదని హెచ్చరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Britain
- Covid cases
- highest
- reports
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

