న్యూఢిల్లీ : బ్రిటన్ ప్రధాని లండన్‌లో తమ కార్యాలయ సిబ్బందికి సంప్రదాయ రుచులతో సంక్రాంతి విందును ఏర్పాటు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో అరిటాకుల్లో వడ్డించిన ఆహార పదార్ధాలను అధికారులు ఆరగించడం కనిపించింది. ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేయగా పెద్దసంఖ్యలో నెటిజన్లు వీక్షించారు.
ఈ షార్ట్క్లిప్లో లండన్ 10 డౌనింగ్ స్ట్రీట్‌లో రిషీ సునాక్ ఏర్పాటు చేసిన పొంగల్ లంచ్‌ను ఆయన కార్యాలయ సిబ్బంది ఆస్వాదించడం కనిపించింది. అరటి ఆకుల్లో ఆహార పదార్ధాలను వడ్డించగా సంప్రదాయ దుస్తులను ధరించిన వ్యక్తులు సర్వ్ చేశారు.
Pongal lunch hosted by PM Rishi Sunak in London.
Grt idea …! Will try to do for my north Indian frnds pic.twitter.com/NKuiatLELX
— ThePonderinGirl💚👨👩👧👦 (@DtPushpaAnand) January 17, 2023
ఈ వారాంతంలో ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతిని జరుపుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నానని, ఈ పర్వదినాన ప్రతి ఒక్కరికీ సుఖ సంతోషాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని రిషీ సునాక్ వీడియో సందేశంలో పేర్కొన్నారు. రిషీ సునాక్ గత ఏడాది అక్టోబర్ 24న తొలి భారత సంతతి ప్రధానిగా ఎన్నికయ్యారు. రిషీ సునాక్ బ్రిటన్ 57వ ప్రధానిగా సేవలందిస్తున్నారు.