అమృత్సర్: పంజాబీ మూలాలు ఉన్న బ్రిటన్ ఎంపీ తన్మన్జిత్ సింగ్ దేశీ(UK MP Tanmanjit Dhesi)కి గురువారం అమృత్సర్ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. బర్మింగ్హామ్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ఆయన అమృత్సర్కు ఉదయం 9 గంటలకు చేరుకున్నారు. అయితే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు లేకపోవడంతో ఆయన్ను విమానాశ్రయంలోనే నిలిపివేశారు. డాక్యుమెంట్లు చూపించాలని ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన్ను కోరారు. అయితే ఆ పత్రాలను చూపించేందుకు ఆయనకు సమయం పట్టింది. దీంతో ఆ ఎంపీ దాదాపు రెండు గంటల పాటు విమానాశ్రయంలో ఉండాల్సి వచ్చింది. ఓసీఐ కార్డు చూపించిన తర్వాతే ఆయన్ను విడిచిపెట్టారు. 11 గంటల తర్వాత ఆయన విమానాశ్రయాన్ని వీడారు. 2017 నుంచి ఆయన బ్రిటన్లో ఎంపీగా ఉన్నారు. అక్కడి సిక్కుల గురించి ఆయన పార్లమెంట్లో పోరాడారు.