16 ఏళ్లు దాటిన వారికి కోవిడ్ టీకా: సీడీసీ

వాషింగ్టన్: అమెరికాలో 16 ఏళ్ల వయసు దాటిన వారు ఇక కోవిడ్ టీకా తీసుకోవచ్చు. ఆ దేశానికి చెందిన అంటువ్యాధుల నియంత్రణ సంస్థ(సీడీసీ) ఇవాళ పేర్కొన్నది. కరోనా సంక్రమించిన వారు.. లేక ఆరోగ్యం విషమ పరిస్థితిలో ఉన్న 16 ఏళ్లు దాటిన వారు టీకా తీసుకోవచ్చు అని అమెరికా హెల్త్ ఏజెన్సీ స్పష్టం చేసింది. నిజానికి చాలా వరకు రాష్ట్రాలు 16 ఏజ్ గ్రూపు వారికి టీకాలు ఇస్తున్నాయి. అలస్కా, జార్జియా, టెక్సాస్, కాలిఫోర్నియా రాష్ట్రాలు ఇప్పటికే 16 ఏళ్ల వయసు వారికి టీకాలు ఇచ్చేశాయి. ఏప్రిల్ 19వ తేదీ నుంచి 18 ఏళ్లు దాటిన వారికి టీకాలు ఇవ్వాలంటూ ఇటీవల అధ్యక్షుడు బైడెన్ అన్ని రాష్ట్రాలకు ఆదేశించారు. ఇప్పటి వరకు ఏ కంపెనీ కూడా 16 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్దేశించలేదు. అమెరికా ఇప్పటి వరకు 21 ఏళ్లు దాటినవారిలో సగం మంది కోవిడ్ టీకా తీసుకున్నట్లు సీడీసీ చెప్పింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

