Kuwait fire : కువైట్ టైర్ డంప్ యార్డ్‌లో అగ్నిప్రమాదం
Kuwait fire : కువైట్‌లోని భారీ టైర్ డంపింగ్ యార్డ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేయడానికి కువైట్ అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. అగ్నికీలల నుంచి భారీగా పొగలు వస్తుండటంతో ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టవచ్చునని అధికారులు ఆందోళన చెందుతున్నారు

కువైట్ సిటీ : కువైట్‌లోని భారీ టైర్ డంపింగ్ యార్డ్‌లో అగ్నిప్రమాదం (Kuwait fire) సంభవించింది. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేయడానికి కువైట్ అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. అగ్నికీలల నుంచి భారీగా పొగలు వస్తుండటంతో ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టవచ్చునని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ అగ్నిప్రమాదం సులైబియా నగరం శివారులోని ఎడారి ప్రాంతంలో నాలుగు రోజుల క్రింతం ప్రారంభమైనట్లు మీడియా నివేదికల ద్వారా తెలుస్తున్నది.
సులైబియా నగరం శివారులో అతి పెద్ద టైర్ల డంపింగ్ యార్డ్ ఉన్నది. ఇక్కడ పనికిరాని టైర్లను డంపింగ్ చేస్తుండటంతో దాదాపు 70 లక్షల వరకు పోగయ్యాయి. వీటిలో చాలా వరకు వివిధ దేశాల నుంచి తీసుకొచ్చినట్లు స్థానిక అధికారులు చెప్తున్నారు. గత కొన్నేండ్లుగా పొగవుతుండటంతో.. ఇక్కడ సాధారణంగా వచ్చే ఇసుక తుఫాన్ కారణంగా పాత టైర్లపై ఇసుక నిండిపోయి ఉన్నది. నాలుగు రోజుల క్రితం ఒక్కసారిగా మంటలు లేవడంతో పాత టైర్లు అగ్నికి ఆహుతవడం మొదలయ్యాయి. వీటి నుంచి వెలువడుతున్న పొగ కారణంగా కువైట్ వాసులకే కాకుండా ఇతర దేశాల వారికి కూడా ఆరోగ్య సమస్యలతోపాటు వాతావరణ సమస్యలు పొంచి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటి నుంచి వెలువడే పొగలో కార్బన్ మొనాక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్స్ వంటి విషపూరిత రసాయనాలు ఉంటాయని, వీటిని పీల్చుకోవడం వల్ల శ్వాసకోశ సమస్యలతోపాటు క్యాన్సర్ వంటివి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్య నిపుణులు చెప్తున్నారు.
రెండేండ్ల క్రితం కూడా ఇదే మాదిరి అగ్నిప్రమాదం జరిగింది. దీని వల్ల దాదాపు రెండున్నర లక్షల స్వేర్మీటర్ల వరకు ప్రభావం కనిపించింది. అప్పటి ప్రమాదం సమయంలో అక్కడ దాదాపు లక్ష వరకు టైర్లు ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఇదే మాదిరి అగ్నిప్రమాదం గత ఏప్రిల్ నెలలో కూడా సంభవించింది. పాత టైర్లను సేకరించి వాటి నుంచి రీ సైకిల్డ్ టైర్లు ఉత్పత్తి చేయాలని ఒక కంపెనీ యోచించింది. టైర్లను పోగేయడం చేశారే కానీ, రీసైక్లింగ్ టైర్లను మాత్రం ఉత్పత్తి చేయడం ప్రారంభించలేదు. పాత టైర్లను ఉపయోగించి పరిశ్రమలకు అవసరమైన రబ్బర్ ఉత్పత్తులు, రోడ్లు వేయడానికి, గ్రౌండ్ ఫ్లోరింగ్ చేయడంలో వినియోగిస్తుంటారు.
ఇవి కూడా చదవండి..
తడిసి మోపెడవుతున్న డిజిటల్ ఖర్చు..
రక్తంలో షుగర్ నియంత్రణకు కృత్రిమ క్లోమం
మిస్ కాల్‌తో గ్యాస్ కనెక్షన్..!
రైతు ఉద్యమంలో చీలిక.. గుర్నామ్‌సింగ్ సస్పెండ్
నీరజ్‌కు అభినందనలు.. ఈరోజు ఆటో రైడింగ్ ఫ్రీ
క్విట్ ఇండియా ఉద్యమానికి 79 ఏండ్లు
లండన్‌లో డెల్టా వేరియంట్ డేంజర్ బెల్స్..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

