Georgian Ski Resort: కార్బన్ మోనాక్సైడ్ పీల్చి.. జార్జియా స్కీయింగ్ రిసార్టులో 12 మంది మృతి
Georgia ski resort: జార్జియా స్కీయింగ్ రిసార్టులో విషాద ఘటన చోటుచేసుకున్నది. విషపూరిత కార్బన్ మోనాక్సైడ్ వాయువు పీల్చడం వల్ల 12 మంది మృతిచెందారు. వీరిలో 11 మంది విదేశీయులు, ఓ జార్జియా దేశస్తుడు ఉన్నారు.
తిబిలిసి: జార్జియా దేశంలోని స్కీయింగ్ రిసార్టు(Georgian Ski Resort)లో విషాద ఘటన చోటుచేసుకున్నది. కార్బన్ మోనాక్సైడ్ విషపూరిత వాయువు పీల్చడం వల్ల 12 మంది మృతిచెందారు. వీరిలో 11 మంది విదేశీయులు, ఓ జార్జియా దేశస్తుడు ఉన్నారు. గుదౌరి ప్రాంతంలో ఉన్న ఓ రెస్టారెంట్ వద్ద ఘటన జరిగింది. నిద్రించే స్థలంలో మృతదేహాలను గుర్తించారు. మాజీ సోవియేట్ ప్రాంతమైన జార్జియాలో ఆ స్కీయింగ్ రిసార్టు ఉన్నది. విద్యుత్తు అంతరాయం ఏర్పడిన సమయంలో.. బిల్డింగ్‌లో ఉన్న ఆయిల్ పవర్ జనరేటర్‌ను స్టార్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇండియన్ రెస్టారెంట్ ఉన్న బిల్డింగ్ రెండవ ఫ్లోర్లో మృతదేహాలను గుర్తించారు. ఈ ఘటన పట్ల దర్యాప్తు ప్రారంభించారు. అయితే మృతుల వివరాలను ఇంకా వెల్లడించలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

