పేరు మార్చుకున్న టర్కీ.. ఆమోదించిన ఐక్యరాజ్యసమితి
అంకారా: మధ్యప్రాశ్చ్య దేశమైన టర్కీ తన పేరును మార్చుకున్నది. ఇంగ్లీష్‌లో ఆ దేశాన్ని టర్కీ(Turkey) అని పిలుస్తారు. అయితే ఇక నుంచి తమ దేశాన్ని తుర్కై(Türkiye) అని పిలువాలని ఆ దేశం ఐక్యరాజ్యసమితిని కోరింది. యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్‌కు తుర్కై విదేశాంగ మంత్రి కవసొగ్లూ లేఖ రాశారు. టర్కీ ప్రభుత్వం పంపిన లేఖను స్వాగతిస్తున్నట్లు యూఎన్ తెలిపింది. అయితే పేరు మార్పు ప్రక్రియ గత ఏడాది డిసెంబర్లో ప్రారంభమైంది. అధ్యక్షుడు రీసెప్ తయ్యప్ ఎర్డగాన్ నేతృత్వంలో ఆ ఉద్యమం సాగినట్లు విదేశాంగ మంత్రి వెల్లడించారు. దేశ బ్రాండ్ వాల్యూను పెంచే ఉద్దేశంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు కవసొగ్లూ తెలిపారు. యూఎన్‌కు లెటర్ అందిన రోజు నుంచే కొత్త పేరును అమలులోకి తీసుకువచ్చారు. టర్కిష్ ప్రజల సంస్కృతి, నాగరికత, విలువలకు కొత్త పేరు ప్రత్యామ్నాయంగా ప్రతిబింబిస్తుందని గతంలో అధ్యక్షుడు ఎర్డగోన్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

