Tunisia | ట్యూనీషియాలో సార్వత్రిక ఎన్నికలు.. బాయ్‌కాట్‌కు పిలుపునిచ్చిన విపక్షాలు
ఎన్నికలు కుట్రలో భాగం అంటూ విమర్శించిన ప్రతిపక్షాలు
Tunisia : ట్యూనీషియాలో సార్వత్రిక ఎన్నికలు శనివారం జరగనున్నాయి. అయితే ఆర్థిక సంక్షోభం కారణంగా ఈ ఎన్నికలను బాయ్‌కాట్ చేయాలని ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి. అధ్యక్షుడు కైస్ సాయిద్ తన అధికారాన్ని శాశ్వతం చేసుకునేందుకు ఈ ఎన్నికలు ఉపయోగపడతాయని ఎన్నహ్ద, ది హార్ట్ ఆఫ్ ట్యూనీషియా ప్రతిపక్షాలు ఆరోపించాయి. అంతేకాదు ఈ ఎన్నికలను కుట్రలో భాగం అంటూ విమర్శించాయి. అరబ్ విప్లవం కారణంగా ట్యూనీషియా స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది.
మాజీ లా ప్రొఫెసర్ అయిన కైస్ సాయిద్ 2019లో ట్యూనీషియా 8వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. మొదట్లో ప్రజలు ఆయన తీసుకొచ్చిన పాలసీలను సమర్ధించారు. కానీ, అవినీతి, ఆర్థిక సంక్షోభం దేశాన్ని పీడిస్తుండడంతో సాయిద్పై వ్యతిరేకత పెరిగింది. అంతేకాదు అధ్యక్షుడి అధికారాలపై ఎలాంటి పరిమితులు ఉండొద్దని ఏకంగా సాయిద్ రాజ్యాంగాన్ని మార్చేశాడు. దాంతో ఆ దేశ ప్రజలు ఎన్నికల్లో ఓటు వేసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. దాంతో, ఓటింగ్ శాతం చాలా తక్కువ నమోదయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

