Donald Trump | ట్రంప్ కుడిచేతిపై మిస్టీరియస్ మార్క్స్.. అధ్యక్షుడి ఆరోగ్యంపై ఊహాగానాలు
Donald Trump | అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆరోగ్యంపై ఇటీవలే పలు ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
Donald Trump | అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆరోగ్యంపై ఇటీవలే పలు ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆయన చేతులపై కమిలిన గాయాలు కనిపించడం ఇటీవలే కలకలం రేపుతోంది. తాజాగా ట్రంప్ కుడిచేతి వెనుక భాగంలో ఓ తెల్లటి మార్క్ కనిపించింది. సోమవారం ఓవెల్ ఆఫీస్ (Oval Office)లో జరిగిన సమావేశం సందర్భంగా అది కెమెరాకు చిక్కింది. దీంతో ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళన రేకెత్తించింది. ఇది చూసిన ట్రంప్ మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ వింత వ్యాధితో బాధపడుతున్నారంటూ వదంతులు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇటీవలే ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మాక్రాన్‌తో భేటీ సందర్భంగా ట్రంప్ చేతిపై కమిలిన గాయాలు కనిపించాయి. ఆ తర్వాత న్యూజెర్సీలో జరిగిన ఫిపా క్లబ్ వరల్డ్ కప్ తిలకించేందుకు వచ్చిన ట్రంప్ కాస్త అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కనిపించారు. కాళ్ల వద్ద నరాలు ఉబ్బిపోయినట్లుగా, కుడి చేతిపై పలు చోట్ల వాపు ఉన్నట్లు కెమెరా కంట పడింది. ఇప్పుడు మరోసారి ట్రంప్ కుడి అరచేతి వెనుక భాగంలో ఇలాంటి గాయాలే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఆ కమిలిన గాయాన్ని దాచేందుకు అధ్యక్షుడు మేకప్‌తో కవర్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృష్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read..
Myanmar | మయన్మార్‌ను మరోసారి కుదిపేసిన భూకంపం
Trump Tariffs | రేపటి నుంచి భారతీయ దిగుమతులపై 50 శాతం సుంకాలు.. అమెరికా అధికారిక నోటీసులు
JD Vance | భారత్‌పై కావాలనే ట్రంప్ సెకండరీ టారిఫ్స్ విధించారు : జేడీ వాన్స్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
‘ఎంజీయూలో అధ్యాపకుల కొరతపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు’
Medicover Hospitals | మెడికవర్ మరణాలపై ప్రశ్నిస్తే జర్నలిస్టు శంకర్‌పై కేసు..
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

