న్యూయార్క్: గోల్డ్ కార్డు వీసాలకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఆదేశాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) సంకతం చేశారు. సంపన్న విదేశీయులు అమెరికాలోకి ప్రవేశించేందుకు గోల్డ్ కార్డు స్కీమ్ బాగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి. ఇదొకరకంగా అమెరికాకు కలిసి రానున్నది. గోల్డ్ కార్డు ప్రోగ్రామ్ కింద.. అమెరికా వీసా కోరుకునే వ్యక్తి సుమారు పది లక్షల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది, లేదా ఏదైనా సంస్థ నుంచి రావానుకుంటే 20 లక్షల డాలర్లు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. గోల్డ్ కార్డు కోసం డబ్బులు చెల్లిస్తే, ఆ కస్టమర్ల వీసా వేగంగా యాక్సిస్‌కు వస్తుంది. దేశంలో గ్రీన్‌కార్డు పొందేందుకు కూడా మార్గం సుగమం అవుతుంది.
గోల్డ్ కార్డు అద్భతమైందని ట్రంప్ అన్నారు. గిఫ్ట్ డబ్బును తీసుకుని, పన్నులను తగ్గించనున్నట్లు చెప్పారు. దీంతో రుణభారం కూడా తగ్గుతుందన్నారు. గోల్డ్ కార్డు ద్వారా వందల బిలియన్ల డాలర్లు సొమ్ము వస్తుందని, దీని వల్ల కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను సురక్షితంగా ఉంచుకుంటుందన్నారు.
ఈ కార్డు కింద దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థి నాన్‌రిఫండబుల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుడి ప్రాసెసింగ్ ఫీజు అందిన తర్వాత వీసా జారి గురించి పనులు ప్రారంభిస్తారు. వెబ్సైట్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత ఒకవేళ ఆ అభ్యర్థికి అప్రూవ్ అయితే, ఆ వ్యక్తి పది లక్షల డాలర్లు గిఫ్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. గోల్డ్ కార్డు కోసం వచ్చే నిధులన్నీ ట్రెజరీలో జమా చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఆ డబ్బును అమెరికా వాణిజ్య పరిశ్రమ అభివృద్ధికి వినియోగించనున్నారు. అమెరికా సమాజానికి ఉపయోగపడే హై వాల్యూ కస్టమర్స్ కు గోల్డ్ కార్డు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నది. విజయవంతమైన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు ఎక్కువగా ఈ జాబితాలో ఉండే అవకాశాలు ఉన్నాయి.
రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే, గోల్డ్ కార్డుల గురించి ట్రంప్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. సంపన్న ఇన్వెస్టర్లు, వ్యాపారవేత్తలను ఆకర్షించేందుకు ఈ స్కీమ్‌ను రూపొందించినట్లు వైట్‌హౌజ్ తన స్టేట్మెంట్లో తెలిపింది. గోల్డ్ కార్డులతో వచ్చే ఆదాయంతో ఇమ్మిగ్రాంట్లకు కావాల్సిన ఏర్పాట్లు చేయనున్నారు.