Donald Trump : భారత సంతతికి చెందిన 34 ఏళ్ల జోహ్రాన్ మమ్దానీ (Zohran Mamdani) అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ను సవాల్ చేసి మరీ న్యూయార్క్ మేయర్ (Newyork Mayor) గా విజయం సాధించారు. దీనిపై తాజాగా ట్రంప్ స్పందించారు. విజయం అనంతరం మమ్దానీ చేసిన ప్రసంగం ఆవేశపూరితంగా ఉందని, ఈ కొత్త మేయర్ కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన వ్యక్తి అని విమర్శించారు.
న్యూయార్క్ నగరం కమ్యూనిస్ట్ క్యూబా, సోషలిస్ట్ వెనెజువెలా వలే మారుతుందని ట్రంప్ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నగర ప్రజలు ఫ్లోరిడాకు పారిపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 2024, నవంబర్ 5న ఏర్పడిన తన ప్రభుత్వం పునరుద్ధరించిందని చెప్పారు. ఇప్పుడు న్యూయార్క్లో ఆ సార్వభౌమత్వాన్ని కొద్దిమేర కోల్పోయామని అన్నారు. అయితే తాము దానిని జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని మయామి నగరంలో నిర్వహించిన అమెరికా బిజినెస్ ఫోరంలో ట్రంప్ మాట్లాడారు.