వాషింగ్టన్: ప్రస్తుత పశ్చిమాసియా యుద్ధంలో అణ్వాయుధాలు వినియోగించే అవకాశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొట్టివేశారు. శ్వేతసౌధంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమెరికా జరిపిన సంప్రదాయ దాడులకు ఇరాన్‌కు పూర్తి నష్టం ఏర్పడిందని తెలిపారు. ఈ యుద్ధంలో అణ్వాయుధాలను వాడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టంచేశారు.
తమ దాడులతో ఇరాన్ ఇప్పటికే కుదేలైందని అన్నారు. అలాంటప్పుడు తాను అణ్వాయుధాన్ని ఎందుకు వాడాలని ప్రశ్నిస్తూ తాము సంప్రదాయ ఆయుధ విధానంలోనే వెళ్తామని, అణ్వాయుధం లేకుండా దానిని నాశనం చేస్తామని తెలిపారు. అలాంటి ఆయుధాలను తామే కాదు ఎవరూ వినియోగించరాదని అన్నారు.