వాషింగ్టన్ : చర్చల ప్రసక్తి లేకపోతే.. ఇరాన్‌తో యుద్ధం కనీసం ఐదు వారాలపాటు కొనసాగే అవకాశం ఉన్నదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంచనా వేశారు. ఖమేనీ ప్రోద్బలంతో తనపై రెండుసార్లు హత్యాయత్నాలు జరిగాయన్న ఆయన.. తాను మాత్రం మొదటి ప్రయత్నంలోనే ఖమేనీ కథను కంచికి చేర్చినట్టు చెప్పుకొచ్చారు.
ఇరాన్‌పై తాము చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ క్లిష్టమైనదైనప్పటికీ, పూర్తిస్థాయిలో దాడులు జరుపుతున్నట్టు పేర్కొన్నారు. యుద్ధ తీవ్రతను ఇలాగే కొనసాగించడం తమకు, ఇజ్రాయెల్‌కు పెద్ద కష్టమేమీ కాదన్నారు. ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకూ ముగ్గురు అమెరికా సైనికులు మరణించినట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొన్నది.