Generic Medicines | జెనరిక్ ఔషధాలపై 200% పన్నులు..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన
దిగుమతి చేసుకుంటున్న జెనరిక్ ఔషధాలపై 200 శాతం పన్ను విధించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటించారు. జెనరిక్ ఔషధాలపై దశలవారీగా 2028 ఆగస్టు నుంచి టారిఫ్ విధించనున్నట్టు తెలిపారు. ఫార్మా కంపెనీలు తమ ఔషధాల ఉత్పత్తిని అమెరికాలో చేపట్టాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.
న్యూఢిల్లీ, జూలై 22 : దిగుమతి చేసుకుంటున్న జెనరిక్ ఔషధాలపై 200 శాతం పన్ను విధించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటించారు. జెనరిక్ ఔషధాలపై దశలవారీగా 2028 ఆగస్టు నుంచి టారిఫ్ విధించనున్నట్టు తెలిపారు. ఫార్మా కంపెనీలు తమ ఔషధాల ఉత్పత్తిని అమెరికాలో చేపట్టాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ సామాజిక మాధ్యమంలో తన నిర్ణయం వెలువరించారు. వచ్చే ఆగస్టు నుంచి రెండేండ్ల పాటు జెనరిక్ ఔషధాల దిగుమతిపై ‘0’ శాతం టారిఫ్ ఉంటుందని, ఆ తరువాత ఏడాది పాటు టారిఫ్‌ను 100 శాతానికి పెంచుతామని తెలిపారు.
ఆ తరువాతి ఏడాది టారిఫ్‌ను 200 శాతానికి పెంచుతామని ప్రకటించారు. ట్రంప్ నిర్ణయం భారత్‌కు చెందిన ఫార్మా కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపనున్నదని పరిశీలకులు పేర్కొంటున్నారు. గత ఏడాది భారతీయ కంపెనీలు 970 కోట్ల డాలర్ల విలువైన జెనరిక్ ఔషధాలను అమెరికాకు ఎగుమతి చేశాయి. అమెరికాలో హైపర్‌టెన్షన్, మధుమేహం, క్యాన్సర్, అంటువ్యాధులు, మానసిక రుగ్మతలు తదితర వ్యాధుల చికిత్సకు భారత్ నుంచి ఎగుమతి అయ్యే ఔషధాలను వినియోగిస్తారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

